Avula files Bail Petition in Nampally Court నాంపల్లి కోర్టులో అవుల సుబ్బారావు బెయిల్ పిటీషన్..!

Agnipath scheme mastermind avula subba rao files bail petition in court

Telangana, Avula Subba Rao, Sai Defence Academy, Director, Secunderabad railway station, WhatsApp chats, Agnipath scheme, Protest, Crime

Avula Subba Rao, the director of Sai Defence Academy, who provoked the violence at Secunderabad railway station in Telangana on 17th June sent to remand. Subba Rao's role came into the picture after some of the WhatsApp chats were leaked and one could see his photograph in a group which allegedly planned the attack on the Secunderabad Railway Station as a protest against the Agnipath recruitment scheme

కోర్టులో ఆవుల సుబ్బారావు బెయిల్ పిటీషన్..! అగ్నిపాథ్ కేసులో ఇరికించారని వాదన.!!

Posted: 06/27/2022 04:54 PM IST
Agnipath scheme mastermind avula subba rao files bail petition in court

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తోన్న సుబ్బారావు సహా అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయగా, ఇవాళ ఆయన నాంపల్లి కోర్టులో తన బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. రైల్వే స్టేషన్‌‌లో విధ్వంసం కేసుతో తనకు సంబంధం లేదని ఆవుల సుబ్బారావు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆర్మీలో సేవ చేసి.. అదే స్పూర్తితో యువత సైన్యంలో చేరాలని ప్రోత్సహించినట్టుగా పేర్కొన్నారు. దేశాన్ని, దేశ ప్రజలను రక్షించడం అనేది ఎంతో పెద్ద అదృష్టమని.. దీనిని యువత అందిపుచ్చుకోవాలని వారిని ప్రోత్సహించానని, ఆర్మీలోకి చేరేందుకు వందల మందిని ప్రోత్సహించానని చెప్పారు. పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. రైల్వే స్టేషన్‌ విధ్వంసం కేసులో సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా తేల్చిన రైల్వే పోలీసులు.. ఇక ఆధారాలను కూడా సేకరించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావించిన అభ్యర్థులను ఒక్కరోజు ముందుగానే వారిని తీవ్రంగా రెచ్చగోట్టాడని పోలీసులు తెలిపారు.

సూత్రధారితో పాటు కేసులోని నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి విధ్వంసం సృషించే విధంగా వాళ్లు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు గర్తించారు. 16న సాయంత్రం నరసరావుపేట నుంచి హైదరాబాద్‌ వచ్చిన సుబ్బారావు,.. బోడుప్పల్‌లోని ఎస్వీఎం గ్రాండ్ లాడ్జిలో బస చేసినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లో చేసే విధ్వంసానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పోస్టు చేశారని పేర్కొన్నారు. అభ్యర్థులను రెచ్చగొట్టి సికింద్రాబాద్ వచ్చేలా చేయాలని తన అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డికి ఆవుల సుబ్బారావు సూచించారని పోలీసులు గుర్తించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles