బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజులలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
స్టాండర్డైజేషన్ విభాగం: 4 పోస్టులు
రీసెర్చ్ అనాలిసిస్: 20 పోస్ట్‌ల
మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్‌మెంట్ (ఎంఎస్సిడి): 22 పోస్ట్‌లు
అర్హత: స్టాండర్డైజేషన్ విభాగం: B.Tech BE, రెండు సంవత్సరాల పని అనుభవం
రీసెర్చ్ అనాలిసిస్:-గ్రాడ్యుయేట్
మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ విభాగం (MSCD): డిప్లొమా ఇంజనీరింగ్, మూడెళ్ళ అనుభవం, మరిన్ని వివరాల కోసం నోటిపికేషన్‌ను చూడండి.
వయోపరిమితి: జూన్ 1 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు వారి అర్హతలు, అనుభవం, దరఖాస్తు ఫారమ్‌లో అందించిన ఇతర వివరాల అధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ప్రాక్టికల్ అసెస్‌మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఫైనల్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్లపాటు కాంట్రాక్ట్‌పై నియమితులవుతారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ - 15 జూలై 2022
ఇతర వివరాలు
దరఖాస్తుదారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. యంగ్ ప్రొఫెషనల్ సూచించిన విధంగా సాధారణ కార్యాలయ పని వేళలను అనుసరించాలి ( 9.00AM నుండి 5.30PM వరకు). మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు BIS అధికారిక సైట్‌ని చెక్ చేయవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more