Uddhav dares rebels to 'win elections sans Sena, Thackeray name 'శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై.. పోరాటం తప్పదు: ఉద్ధవ్ ఠాక్రే

Had suspected this we were backstabbed by our own uddhav thackeray on rebellion in shiv sena

Uddhav Thackeray, Maharashtra Political Crisis, Political Crisis, Election Special, Shiv Sena, Eknath Shinde, Eknath Shinde News, Maharashtra Political Crisis Update, Uddhav Thackeray Government, Rebel MLAs, backstabbed politics, Uddhav Thackeray backstabbed, Maharashtra Politics

Launching a scorching counter-attack on the rebels, Maharashtra Chief Minister Uddhav Thackeray on Friday dared them to win the elections "without using the name of Shiv Sena or the Thackerays", even as allies Nationalist Congress Party-Congress reiterated their commitment to save the Maha Vikas Aghadi government.

శివసేనను వదిలివెళ్లిన ఎమ్మెల్యేలపై.. పోరాటం తప్పదు: ఉద్ధవ్ ఠాక్రే

Posted: 06/24/2022 07:07 PM IST
Had suspected this we were backstabbed by our own uddhav thackeray on rebellion in shiv sena

తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే తాను వీడానని, తిరుగుబాటుదారులపై పోరాటాన్ని కాదని శివసేన ఆయన అన్నారు. ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శుక్రవారం శివసేన భవన్‌కు తరలివచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. అధికారంపై తనకు ఎలాంటి ఆశలేదన్నారు.

చచ్చినా సరే శివసేను వీడమని చెప్పిన నేతలు ఇప్పుడు పారిపోయారని విమర్శించారు. శివసేను చీల్చాలని రెబల్‌ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని విమర్శించారు. నిజంగా, ఆ ధైర్యం ఉన్నవారు బాలసాహెబ్‌, శివసేన పేరు ఎత్తుకుండా ప్రజల్లోకి వెళ్లి ఆ పని చేయాలని సవాల్‌ విసిరారు. శివాజీ మహారాజ్‌ ఓడిపోయినా ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం తనను కూడా తస్మదీయులే వెన్నుపోటు పోడిచారని.. అయినా తాము శివసేనను పునర్నిర్మిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన ఆరోగ్యం సహకరించడంలేదని దీంతో తాను సరిగా పని చేయలేకపోతున్నానని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

మెడ, తల బాధతో పాటు కళ్లు కూడా తెరువలేకపోతున్నానని, అయినా దాని గురించి దిగులు లేదన్నారు. విశ్వాసపాత్రులమని చెప్పి కొందరు నమ్మక ద్రోహం చేశారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీకి వ్యతిరేకరంగా మారిన రెబల్స్‌ డబ్బుల కోసం అమ్మడుపోయారని ఆరోపించారు. తాను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు (గత నవంబర్‌లో) కొందరు శివసేన ఎమ్మెల్యేలు తనకు ద్రోహం చేసేందుకు ప్లాన్‌ చేశారని ఉద్ధవ్ ఆరోపించారు. షిండే రెబెల్‌ గ్రూప్‌లో ఉన్నవారిపై తనకు ఎలాంటి పగ లేదన్నారు. వీడిన వారి గురించి ఎందుకు బాధపడాలి అని ప్రశ్నించారు. శివసైనికులు కోరితే అధ్యక్ష పదవి నుంచి తాను దిగిపోతానని పునరుద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles