US Top Court says Americans have right to carry guns తుపాకులతో తిరగే హక్కు ప్రజలకు ఉంది: అమెరికా సుప్రీంకోర్టు

America s supreme court extends the right to bear arms outside the home

United States, weapon, Firearm, court, judge, United States Department of Justice, firearm, personal weapon control policy, military weaponry, judiciary,constitution (law), judge, Joe, biden, donald trump, new york, national rifle association, us gun laws, texas school shooting, US Federal Government

The US Supreme Court ruled Thursday that Americans have a fundamental right to carry a handgun in public, a landmark decision with far-reaching implications for states and cities across the country confronting a surge in gun violence.

తుపాకులు కలిగి ఉండే హక్కు ప్రజలకు ఉంది: అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

Posted: 06/24/2022 03:13 PM IST
America s supreme court extends the right to bear arms outside the home

అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో వారంలో ఏదో ఒక చోట అమాయకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కిలిసిపోతున్నాయి. దీంతో అమెరికా తుపాకి సంస్కృతిపై చర్చ మొదలైంది. తుపాకులను నిషేధించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఇటీవల జరిగిన టెక్సాస్ లోని ప్రైమరీ పాఠశాల మరణాలపై దేశం మొత్తం ఒక్కటై ముక్తకంఠంతో ఖండించింది.

అధికారంలోని ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. అమెరీకన్ వాసులు తుపాకులు కలిగివుండటం ఆత్మరక్షణలో భాగమేనని.. ఇది తమ వ్యక్తిగత హక్కుగా కూడా పేర్కోంటున్న తరఉనంలో అదే తుపాకులు ప్రాణాలను విచ్చలవిడిగా బలిగొంటున్న తరుణంలో ప్రభుత్వాలు వాటిని నియంత్రించే చర్యలకు పూనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోమారు చర్చనీయాంశమైంది. బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం అమెరికన్ల హక్కని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు.

న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పౌరులు తమ వెంట తుపాకులు తీసుకెళ్లొచ్చని, వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకి కలిగి ఉండడం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యూయార్క్ గతంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బైడెన్ సర్కారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles