SC upholds SIT clean chit to PM Narendra Modi గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసులో ప్ర‌ధాని మోదీకి సుప్రీం క్లీన్ చిట్‌

Sc dismisses zakia jafri s plea against clean chit to narendra modi in 2002 riots case

gujarat riots, zakia jafri, narendra modi, supreme court gujarat riots case, sc plea gujarat riots, Former MP Ehsan Jafri. Congress MP, Gujarat Riots, Narendra Modi, Zakia Jafri, Gujarat, Politics

An appeal against the exoneration of Prime Minister Narendra Modi in a 2002 Gujarat riots case by the wife of a Congress MP killed in the violence is "devoid of merits" and filed "to keep the pot boiling", the Supreme Court said on Friday.

గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసులో ప్ర‌ధానికి క్లీన్ చిట్‌ పై పిటీషన్.. తిరస్కరణించిన సుప్రీం..

Posted: 06/24/2022 01:02 PM IST
Sc dismisses zakia jafri s plea against clean chit to narendra modi in 2002 riots case

2002లో గుజ‌రాత్‌లో జ‌రిగిన‌ అల్ల‌ర్ల కేసులో గ‌తంలో మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ తీర్పును స‌వాల్ చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జ‌ఫ్రీ భార్య జాకియా జ‌ఫ్రీ వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. సిట్ ఇచ్చిన తీర్పును సుప్రీం స‌మ‌ర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము స‌మ‌ర్ధిస్తున్నామ‌ని, ఈ కేసులో దాఖ‌లైన నిర‌స‌న పిటీష‌న్‌ను తోసిపుచ్చుతున్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాసనం పేర్కొన్న‌ది.

2021, డిసెంబ‌ర్ 8వ తేదీన ఈ కేసులో విచార‌ణ పూర్తి అయ్యింది. అయితే సుప్రీం త‌న తీర్పును ఇవాళ వెలువ‌రించింది. గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జ‌ఫ్రీ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసులో సిట్ తీర్పును 2017లో గుజ‌రాత్ హైకోర్టు స‌మ‌ర్ధించింది. గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో మోదీ ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. మోదీతో పాటు ఇత‌ర రాజ‌కీయ‌వేత్త‌లు, అధికారుల‌పై 2006లో జాకియా జ‌ఫ్రీ కేసును న‌మోదు చేసింది. 2008లో అల్ల‌ర్ల‌పై సిట్ ద‌ర్యాప్తు ప్రారంభ‌మైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles