ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నా.. ఇప్పటికీ అటో రంగంలో పెట్రోల్, డీజిల్ వాహనాల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అమ్మాకాలు ఓ వైపు స్పష్టం చేస్తూనేవున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల నేపథ్యంలోనూ వాటి వైపే వాహన యజమానులు మొగ్గుతున్నారంటే.. విద్యుత్ వాహనాలపై ఇప్పటివరకు వారిలో పూర్తి నమ్మకం కలగకపోవడమే. ఇక దీనికి తోడు విద్యుత్ చార్జింగ్ ష్టేషన్లు కూడా అందుబాటులోకి రాకపోవడమే. గత రెండు మూడు నెలులుగా పలువురి మరణాలకు, ఆస్తుల ధగ్ధానికి కారణమైన ఈవీ వాహనాలపై ప్రజల్లో తెలియని భయం నెలకొని ఉంది.
అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు అని అనుకుని కొందరు ధైర్యం చేసి విద్యుత్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటుంది. గత కొన్ని నెలలుగా జరిగిన అన్ని ఘటనలు కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఈవీ కార్ల విషయంలో మాత్రం ఎలాంటి భయాలు అవసరం లేదని అంటున్నారా.? అయితే అక్కడికే వస్తున్నాం.. తాజాగా ముంబై నగరంలో టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి కారులో ఉన్నట్టుండి మంటలు లేచాయి. మంటలను ఆర్పేసరికే అది బాగా దెబ్బతిన్నది.
ఓ హోటల్ ఎదుట ప్కార్ చేసిన కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. టాటా గ్రూపు కంపెనీ టాటా మోటార్స్ కు చెందిన నెక్సాన్ ఈవీ కారు ప్రమాదానికి గురికావడం గమనార్హం. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ముందుస్థానంలో నిలిచిన ఈవీ కార్లలో ఇది ఒకటి. కాగా, ఈ కారే ముంబైలోని వెస్ట్ వాసాయ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ముందు నిలిపగా, కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణం ఏంటన్నది తెలియలేదు.
Watch Video: #TataNexonEV catches massive #fire in #Mumbai. While the reasons are unknown yet, the incident happened in Vasai West (near Panchvati hotel), Mumbai, #Maharashtra. Responses from @TataMotors are awaited. #TataNexon #NexonEV @Tatamotorsev
— Shakti Nath Jha (@ShaktiNathJha22) June 23, 2022
V.C.: WhatsApp Forward pic.twitter.com/UWxGjQpd8W
అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే కారు రన్నింగ్ లో ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరిగితే తప్పించుకునే మార్గం ఉండదని.. కారులోని వ్యక్తుల ప్రాణాలకు కూడా ప్రమాదం పోంచి వుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నెక్సాన్ ఈవీ ప్రమాదంపై వెనువెంటనే స్పందించిన టాటా మోటార్స్ సంస్థ.. కారు ప్రమాదంపై తమ సంస్థాగత విచారణ నిర్వహిస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. ప్రమాదానికి దారితీసిన అంశాలను గుర్తించేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నామని, పూర్తయిన తర్వాత ప్రకటన చేస్తామని తెలిపింది.
గతంలో ఓలా, ప్యూర్ఈవీ సహా పలు కంపెనీలు ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈవీ ప్రమాదాలు అసాధారణమేమీ కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవేనని పేర్కొన్నారు. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ వాహనాలతో పోలిస్తే ఈవీలే సురక్షితమైనవని ప్రకటించారు. ‘‘ఈవీ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లోనూ ఇవి జరుగుతాయి. కానీ, ఈవీల్లో అగ్ని ప్రమాదాలు అన్నవి ఐసీఈ అగ్ని ప్రమాదాల కంటే తక్కువ’’ అని ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more