Roll back Agnipath: RJD Tejashwi Yadav అగ్నిపథ్ పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్..

Govt have to take back agnipath scheme demands rahul gandhi

Rahul Gandhi, Congress party protest, Agnipath, Agnipath Scheme, Agnipath protests, agnipath, Supreme Court, SC, plea, uttar pradesh, supreme court, plea, indian army, caveat, agnipath scheme, agnipath, Indian army, army recruitment, National, Politics

Congress leader Rahul Gandhi on Wednesday alleged that the Centre was “weakening” the army through the ‘Agnipath’ scheme, and said Prime Minister Narendra Modi will have to withdraw the military recruitment initiative just like the farm laws were rolled back.

అగ్నిపథ్ పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్.. మా వాదనలు వినాలని వినతి

Posted: 06/23/2022 06:23 PM IST
Govt have to take back agnipath scheme demands rahul gandhi

మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, అందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం నుంచి వెనక్కు తగ్గబోమని కేంద్రప్రభుత్వంతో పాటు జాతీయ భద్రాతా సలహాదారు కూడా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. అయితే దేశ రక్షణ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేయడం సముచితం కాదని, అగ్నిపథ్ పథకం రక్షణా వ్యవస్థను బలహీనం చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పథకం ప్రకటించిన నాటి నుంచి చెబుతూనే ఉన్నారు.

ఇక తాజాగా ఇవాళ ఆయన మరో అడుగు ముందేకేసీ నూతన సాగు చట్టాలను కూడా వెనక్కు తీసుకోబోమని కేంద్రం, కేంద్రమంత్రులు స్పష్టం చేసిన విషయం తెలిసిందేనని, అయితే రైతుల ఆందోళనలు, నిరసనలు జోరందుకోవడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. అదే విధంగా అగ్నిపథ్ పథకాన్ని కూడా కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ వెనక్కు తీసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రైతుల మాదిరిగానే శాంతియుత అందోళనలతో కేంద్రం దిగివస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తపర్చారు. ఇందులో భాగంగా తమ పార్టీ కూడా ఈ నెల దేశవ్యాప్త అందోళనకు పిలుపునిచ్చిందని తెలిపారు.

అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా ఈనెల 27న దేశ‌వ్యాప్తంగా స‌త్యాగ్ర‌హం నిర్వ‌హిస్తుంద‌ని రాహుల్ గాంధీ ప్రకటించిన తరుణంలో ఆ నిరసన వివరాలను పార్టీ నేత, రాజ్య‌స‌భ ఎంపీ కేసీ వేణుగోపాల్ వివరించారు. స‌త్యాగ్ర‌హంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ నిర‌స‌న‌లు చేప‌డ‌తార‌ని చెప్పారు. అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా త‌మ పోరాటం నిరంతరం కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. ఇక అంత‌కుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అగ్నిప‌థ్‌ను త‌క్ష‌ణ‌మే వెన‌క్కితీసుకోవాల‌ని మ‌రోసారి డిమాండ్ చేశారు.

తాత్కాలిక సైనిక నియామ‌క ప‌ధ‌కంతో కేంద్రం ఆర్మీని నిర్వీర్యం చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాషాయ పాల‌కులు వ‌న్ ర్యాంక్‌..వ‌న్ పెన్ష‌న్ గురించి మాట్లాడ‌త‌రాని, వారు ఇప్పుడు నో ర్యాంక్‌..నో పెన్ష‌న్‌తో ముందుకొచ్చార‌ని ఎద్దేవా చేశారు. చైనా మ‌న స‌రిహ‌ద్దుల్లో కూర్చుంటే మ‌నం సైన్యాన్ని బ‌ల‌హీన‌ప‌రిచే చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, ఇది దేశ ప్ర‌యోజనాల‌కు హానిక‌ర‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జాతీయ‌వాదుల‌మ‌ని చెప్పుకుంటూ కాషాయ పాల‌కులు సైన్యాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నార‌ని అన్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన మాదిరిగానే అగ్నిప‌థ్‌ను కూడా ర‌ద్దుచేయాల‌ని మోదీ స‌ర్కార్‌ను రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh