YCP Councilor Lavanya Attacks TV Actor Chan Basha బుల్లితెర నటుడిపై జంగారెడ్డి గూడెం కౌన్సిలర్ దౌర్జన్యం..!

Ycp councilor lavanya attacks tv actor chan basha in broad day light

ycp councilor lavanya attack Chan Basha, ycp councilor lavanya attack tv actor Chan Basha, ycp leader attack tv actor Chan Basha at jangareddygudem, TV Actor, Chan Basha, plot, Encroachment, local councillor, Lavanya, attack, Police complaint, jangareddygudem, Eluru, Andhra pradesh, Crime

In a shocking Incident a Ruling party woman councillor attacks a TV actor in broad daylight. As per the reports the Tv actor alleged that the councillor had encroached his land and demanding money from him. With the allegation she attacked him from back which led him severe injuries.

ITEMVIDEOS: బుల్లితెర నటుడిపై జంగారెడ్డి గూడెం కౌన్సిలర్ దౌర్జన్యం..!

Posted: 06/23/2022 08:17 PM IST
Ycp councilor lavanya attacks tv actor chan basha in broad day light

ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విపక్షాల అరోపణలకు మరో సంఘటన నిలువెత్తు ఉదాహరణగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అధికార పార్టీకి చెందిన కౌన్సీలర్ లావణ్య.. బుల్లితెర నటుడు చాన్ బాషాపై దాడికి పాల్పడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమె.. దౌర్జన్యనికి పాల్పడుతూ తన భూమిని కబ్జా చేస్తోందని అరోపిస్తున్న తరుణంలో అక్కడే వున్న అమె వెనుకగా వచ్చి నటుడ్ని వెనుకనుంచి బలంగా నెట్టడంతో ఆయన కిందపడ్డారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో ఆయన షాక్ కు గురయ్యారు. గాయపడిన చాన్​ బాషాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుల్లితెర నటుడు చాన్ బాషాపై స్థానిక 28వ వార్డు వైకాపా కౌన్సిలర్ లావణ్య దాడి చేశారు. వార్డు పరిధిలోని డాంగే నగర్​లోని ఓ స్థలం విషయంలో చాన్ భాషా, కౌన్సిలర్ మధ్య వివాదం కొనసాగుతోంది. హైదరాబాద్​లో ఉన్న చాన్​ బాషా.. తన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకొని జంగారెడ్డిగూడెం వచ్చానని ఆయన తెలిపారు. ఈ క్రమంలో తన స్థలాన్ని కొందరు తన స్థలాన్ని ఆక్రమించారని అరోపించారు. అయితే మీడియా ప్రతినిధులు ఎవరు..? వారి పేర్లు చెబుతారా.? అని అడగడంతో అయన కౌన్సిలర్ ప్రస్తావన తీసుకువచ్చారు.

దీంతో అక్కడే ఉన్న కౌన్సిలర్ లావణ్య వెనుక నుంచి చాన్ బాషాను బలంగా నెట్టారు. ఈ ఘటనలో కిందపడిపోయిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. డాంగే నగర్​లోని ఓ స్థలంలో ఉన్న రేకుల షెడ్డును కొందరు ధ్వంసం చేశారు. దీంతో షెడ్డు వద్ద ఇరువర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఆక్రమణ ఘటనపై పోలీసులకు పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ స్థలం తమదేనంటూ దానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని ప్రత్యర్థి వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లో ఉండటంతో ఖాళీగా ఉన్న తన స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నిస్తున్నారని చాన్‌ బాషా ఆరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles