దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరిపోయింది. దేశంలో బ్యాంకులను మోసగించిన కేసులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో అతి పెద్ద కేసుగా దీనిని పరిగణిస్తున్నారు. పదులు, వందలు దాటి ఏకంగా వేల కోట్ల రూపాయలను రుణాలను పొంది బ్యాంకులను బురడీ కొట్టిస్తున్న దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ మోసం చేసింది. రూ.34,615 కోట్ల మోసానికి తెరలేపింది. గత కొన్నేళ్ల క్రితమే ఈ మోసానికి తెరలేపగా.. సంస్థతో పాటు కీలక డైరెక్టర్లు, మాజీ సభ్యులపై సీబిఐ కేసు నమోదు చేసింది.
కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్‌లపై కేసు నమోదు చేసిన సీబిఐ.. ఈ మోసంలో భాగం ఉందన్న ఆరోపణలతో అమరిల్లీస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టితో పాటు మరో ఆరుగురు బిల్డర్లపైనా సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇదే సీబీఐ దర్యాప్తు చేస్తున్న అతిపెద్ద కేసని అధికారులు తెలిపారు. గతేడాది డీహెచ్ఎఫ్ఎల్ను పిరమాల్ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కుంభకోణంపై ఈ నెల 20న కేసు నమోదు చేయగా.. ఆకస్మిక దాడి కోసం సన్నాహాలు చేసుకుంది.
అదను చూసి సీబీఐకి చెందిన 50 మందికిపైగా అధికారుల బృందం ముంబైలోని 12 ప్రాంగణాల్లో ఎఫ్ఐఆర్ లిస్టెడ్ నిందితులకు చెందిన 12 చోట్ల సోదాలు నిర్వహించింది. వీరిపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ.34,615 కోట్ల మేర మోసంచేసేందుకు కుట్రపన్నారనే అభియోగాలు నమోదయ్యాయి. ఆయా బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు రూ.42,871 కోట్ల రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
లెక్కలను డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల్లో తప్పుగా చూపించి.. వాస్తవాలను దాచిపెట్టి కపిల్, ధీరజ్ వాధావన్ ఇతరులతో కుట్రపూరితంగా తిరిగి చెల్లించలేమంటూ చేతులు ఎత్తేశారని సీబీఐ పేర్కొంది. 2019 మే నెల నుంచి రుణాలను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసింది. దీంతో వారి రుణాలు మొండి బకాయిలుగా మారాయని పేర్కొంది. ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ కుట్రపూరిత చర్యలతో బ్యాంకులకు దాదాపు రూ.34,615 కోట్లు నష్టం జరిగిందని వివరించింది. వీరిద్దరూ గతంలో మోసం చేసిన కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
డీహెచ్ఎల్ఎఫ్ రుణఖాతాలను రుణదాత బ్యాంకులు వేర్వేరు సమయాల్లో నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయని అధికారులు తెలిపారు. నిధుల కుంభకోణంలో కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లతో పాటు స్కైలార్క్ బిల్డ్ కాన్ కంపెనీ, దర్శన్ డెవలపర్స్, సిగ్తియా కన్ స్ట్రక్షన్స్ బిల్డర్స్, టౌన్ షిప్ డెవలపర్స్, శిషిర్ రియల్టీ, సన్ బ్లింక్ రియల్ ఎస్టేట్, సుధాకర్ శెట్టి తదితరులను నిందితులుగా చేర్చింది. వీరందరిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌లోని పలు సెక్షన్లతో పాటు చీటింగ్ అభియోగాలతో కేసులు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more