Kannada actor suffers spinal injury in Goa కన్నడ నటుడికి గోవాలో ప్రమాదం.. బెంగళూరులో శస్త్రచికిత్స..

Kannada actor falls off trampoline in goa to undergo operation for cervical spine injury

Diganth, Diganth goa accident, Kannada actor accident, cervical spine injury Diganth, Diganth trampoline accident, Kannada actor trampoline accident Goa, Diganth Manchale, Diganth Manchale accident, Diganth Manchale injury, Diganth injury, Diganth neck injury, Diganth accident, Diganth

Kannada actor Diganth (38) suffered a cervical spine injury after he fell off a trampoline while he was on vacation with his family in Goa. The actor was airlifted to the Hindustan Aeronautics Limited (HAL) airport in Bengaluru Tuesday and rushed to the Manipal Hospital for treatment.

కన్నడ నటుడికి గోవాలో ప్రమాదం.. బెంగళూరులో శస్త్రచికిత్స..

Posted: 06/21/2022 07:48 PM IST
Kannada actor falls off trampoline in goa to undergo operation for cervical spine injury

గోవా పర్యటనకు వెళ్లిన కన్నడ హీరో దిగంత్‌ మంచలే ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్నడ హీరో దిగంత్ మంచలే ఇటీవల తన భార్య ఐంద్రిత రేతో గోవా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భార్యతో కలసి బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా, ఆయనకు బీచ్‌లో ట్రంపోలైన్ కనబడింది. దీంతో దానిపై నిల్చోని ఆయన కూడా కొద్దిసేపు జంప్‌ చేశారు. ఈ క్రమంలో సరదాగా అనిపిస్తుండటంతో ఆయన మరింతగా ఎగురుతుండగా ఆయన పట్టుతప్పి పడిపోయాడు. దీంతో ఆయన మెడ వద్ద తీవ్రమైన నోప్పి ఏర్పడింది.

దిగంత్ మంచాల్ ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. ఇక ఆయన పరిస్థితి మెరుగుకాకపోవడంతో.. ఆయనకు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు. వాన’ చిత్రంలో కీ రోల్‌ పోషించిన దిగంత్‌కు అడ్వెంచర్స్‌ చేయడం అంటే ఆసక్తి. దీంతో తరచూ అతడు సైకిలింగ్‌, ట్రెక్కింగ్‌,  సముంద్రంలో స్క్యూబా డైవింగ్‌ చేస్తుంటాడు. అంతేకాదు ఈ వీడియోలను తరచూ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తుంటాడు. కాగా గాలిపాట, హౌస్‌ఫుల్‌ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దిగంత్‌ ఇటీవల నటించిన గాలిపాట 2 మూవీతో ఆగష్టు 12న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌ నటించిన ‘ఎవరు’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles