Agnipath: Centre files caveat in SC అగ్నిపథ్ పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్..

Centre files caveat in supreme court on pleas challenging agnipath scheme

Supreme Court, Agnipath, Agnipath Scheme, Agnipath protests, agnipath, Supreme Court, SC, plea, uttar pradesh, supreme court, plea, indian army, caveat, agnipath scheme, agnipath, Indian army, army recruitment, National, Politics

The central government on Tuesday filed a caveat application in the Supreme Court urging it to hear the government in the petitions filed before it challenging the 'Agnipath' recruitment scheme for defence forces. A Caveat application is filed by a litigant to ensure that no adverse order is passed against him or her without being heard.

అగ్నిపథ్ పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్..

Posted: 06/21/2022 07:36 PM IST
Centre files caveat in supreme court on pleas challenging agnipath scheme

మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే అటు బిహార్, ఇటు తెలంగాణలో ఆర్మీ అభ్యర్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆర్మీ అశావహ అభ్యర్థులు తలపెట్టిన విధ్వంసం శృతిమీరి బోగీలను తగ్గలపెట్టడం వరకు వెళ్లింది. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసుల జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించిన విషయం కూడా తెలిసిందే. ఈ విధ్వంసాలు, నిరసనల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్ ను దాఖలు చేసింది.

అగ్నిపథ్ కు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడిన తరుణంలో తమ వైపు నుంచి కూడా వాదనలను వినాలని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇప్పటి వరకు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. హర్ష్ అజయ్ సింగ్ అనే అడ్వొకేట్ నిన్న ఒక పిటిషన్ వేశారు. అగ్నిపథ్ అమలుపై మరోసారి పునరాలోచించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్ లో అజయ్ కోరారు. అంతకు ముందు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు లాయర్లు కూడా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు.

సాయుధ బలగాల నియామకాలకు సంబంధించి శతాబ్ద కాలంగా ఉన్న ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందని... కనీసం పార్లమెంటు ఆమోదం కూడా లేకుండానే అగ్నిపథ్ ను అమలు చేస్తోందని ఎంఎల్ శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అగ్నిపథ్ వల్ల జాతీయ భద్రత, సైన్యం ఎలాంటి ప్రభావానికి గురవుతుందో అంచనా వేయడానికి సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అడ్వొకేట్ విశాల్ తివారీ తన పిటిషన్ లో కోరారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేయాలని సుప్రీంకు విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles