IIIT-Basara students put forth demands, want in-house VC ఐఐఐటీ బాసర విద్యార్థుల అందోళన విరమణ..

Iiit basara students end protest after telangana minister s assurance

university grants commission, satish pedapalli, Sabita Indrareddy, Minister’s assurance, IIIT Basara, incharge vice chancellor Rahul Bojja, education commsioner Vakati Karuna, superintendent of police Praveen Kumar student governing council, nirmal district, r musharraf ali farooqi, rgukt, telangana

As deliberations continue between protesting students and administration, IIIT-Basara student governing council has put forth a list of long-term and short-term demands before the Telangana government and the newly-appointed director.

మంత్రి హామీతో.. ఐఐఐటీ బాసర విద్యార్థుల అందోళన విరమణ..

Posted: 06/21/2022 10:41 AM IST
Iiit basara students end protest after telangana minister s assurance

సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా అందోళన చేపట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఇవాళ ఉదయం నిరసనలకు స్వస్తి పలికారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేరుగా విద్యార్థుల గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో గత అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు. ఇవాళ ఉదయం నుంచి తరగతులకు హాజరయ్యారు. విద్యార్థులు ఆందోళనకు కారణమైన సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా నెల రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు. మంత్రి హామీ నేపథ్యంలో విద్యార్థులు తమ ఆందోళన విరమించినట్టు విద్యార్థులు తెలిపారు.

సమస్యల పరిష్కరానికి వెంటనే రూ. 5.6 కోట్లు విడుదల చేస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ వీసీ రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ట్రిపుల్ ఐటీకి చేరుకున్న మంత్రి సబిత విద్యార్థుల సమస్యలపై తొలుత అధికారులతో చర్చించారు. ఆ తర్వాత 20 మంది విద్యార్థులతో కూడిన స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌తో ఆడిటోరియంలో సమావేశమయ్యారు.

అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. నెల రోజుల్లో సమస్యలన్నీ తీరుస్తానని మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే, రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. స్పందించిన సబిత.. మంత్రిని తాను స్వయంగా చెబుతున్నానని, ఇంకా ఎలాంటి హామీ కావాలని ఆమె ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. నేటి నుంచి తరగతులకు యథావిధిగా హాజరవుతామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles