Sri Sundara Raja Swamy Avatara Utsavams కన్నుల పండువగా శ్రీ సుందరరాజ స్వామి అవతారోత్సవాలు

Annual avatara utsavam of tiruchanoor sri sundara raja swamy

Sri Sundara Raja Swamy Avatara Utsavams, Annual Avatara Utsavams of Sri Sundararaja Swamy, Tiruchanoor Sri Sundararaja Swamy, Vahana Seva of Sri Sundararaja Swamy, Three day Avatara Utsavams of Sri Sundararaja Swamy, Sri Sundararaja Swamy, Avatara Utsavams, Vahana Seva, Unjal seva, Snapana Tirumanjanam, Sri Krishna Mukha Mandapam, Tiruchanoor, Tirupati, Andhra Pradesh

The annual Avatara Utsavams of Sri Sundararaja Swamy temple in Tiruchanoor will be observed from June 20th to 22nd2, 2022. Every day there will be Snapana Tirumanjanam in Sri Krishna Mukha Mandapam between 2pm and 3:30pm to Sri Sridevi Bhudevi sameta Sundararaja Swamy. In the evening Unjal Seva will be observed here. Sri Sundararaja will take ride on vahanams to bless His devotees

కన్నుల పండువగా శ్రీ సుందరరాజ స్వామి అవతారోత్సవాలు

Posted: 06/21/2022 11:33 AM IST
Annual avatara utsavam of tiruchanoor sri sundara raja swamy

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అవతార మహోత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు రావడంతో తిరుచానూరు భక్తులతో నిండిపోయింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, తోమాల సేవ నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం చేశారు.

ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం జరిపారు. సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ నిర్వహించారు. వాహనమండపంలో శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేశారు. రాత్రి 7 నుంచి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈఓ లోక‌నాథం, ఏఈఓ ప్రభాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీసుందరరాజ స్వామి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారు చేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఆ తర్వాత సుందరరాజస్వామికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రంనాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles