ప్రభుత్వం జారీచేసిన నాణేలాకు అదే ప్రభుత్వంలో విలువ లేకపోతే.. అది ఎవరి తప్పు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలను దుకాణాదారులు లెక్కచెయకపోతే అందుకు బాధ్యులు ఎవరు. ఇదే అతని మదిని ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రభుత్వం విడుదల చేసిన నాణేం.. చలామణిలో కనిపించకపోవడం.. దానితో జరిపే లావాదేవీలను దుకాణాదారులు కూడా అనుమతించకపోవడంతో.. ఏం జరుగుతుందో తెలయని యువవైద్యుడు నాణేలు చెల్లబడి అవుతాయని చాటాలని పూనుకున్నాడు. ఆ దిశగా సంకల్పించిన ఆయన.. అందుకోసం ఏం చేశాడు.
యువవైద్యుడు ప్రభుత్వ నాణేలాను చెల్లుబాటు అవుతాయని చాటాలనే దిశగా ఎందుకు అడుగులు వేశారు.? అసలు ఆ దిశగా ఆయనను ప్రేరేపించిన ఘటనలే ఏంటీ.. ఎవరి కారణంగా ఆయన ఈ నాణాలను తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల వెట్రివేల్ ఇటీవల మీడియా దృష్టిని ఆకర్షించాడు. రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు పోగు చేసి వెట్రివేల్ ఓ కారును కొనుగోలు చేశాడు. వృత్తిరీత్యా వైద్యుడైన వెట్రివేల్ ఇదేమీ సరదా కోసం చేయలేదు. దీని వెనుక బలమైన సామాజిక కారణం ఉంది. వెట్రివేల్ కుటుంబం స్మార్ట్ కిడ్స్ పబ్లిక్ స్కూల్ పేరిట ఓ పాఠశాలను నిర్వహిస్తోంది. ఆ పాఠశాలకు చెందిన చిన్నారులు రూ.10 నాణేలను ఉత్త రేకు బిళ్లలుగా భావిస్తూ ఆడుకోవడం వెట్రివేల్ గమనించాడు.
రూ.10 నాణేలు చెల్లవని సమాజంలో జరుగుతున్న ప్రచారం కారణంగానే, ఆ పది రూపాయల నాణేలు చిన్న పిల్లల చేతిలో ఆటవస్తువులుగా మారాయని గుర్తించాడు. దాంతో, రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని నిరూపించాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత మరో సంఘటనతో అతడి సంకల్పం మరింత బలపడింది. ఓ రెస్టారెంటుకు వెళ్లిన వెట్రివేల్ బిల్లు చెల్లించే సమయంలో రూ.10 నాణెం ఇవ్వగా, క్యాషియర్ తిరస్కరించడం వెట్రివేల్ ను అసంతృప్తికి గురిచేసింది. ఎందుకు తీసుకోవని నిలదీయగా, ఆ క్యాషియర్ దురుసుగా మాట్లాడడం వెట్రివేల్ పట్టుదలను రెట్టింపు చేసింది. పైగా, ఫేక్ నాణేలు ఇస్తున్నారంటూ ఆ క్యాషియర్ వాదించడం ఈ తమిళ యువకుడిని వెంటనే కార్యరంగంలోకి దూకేలా పురిగొల్పింది.
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని చేసిన ప్రకటనతో వెట్రివేల్ మరింత ధైర్యం తెచ్చుకున్నాడు. నెలరోజుల వ్యవధిలో రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు సేకరించాడు. వాటిసాయంతో ఓ కారు కొనుగోలు చేసి, రూ.10 నాణేలు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని అందరికీ చాటాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు కారు డీలర్ ను ఒప్పించి, అన్నీ రూ.10 నాణేలతోనే కారు కొనుగోలు చేశాడు. తన చర్య మరింత మందిని ఈ దిశగా చైతన్యవంతులను చేస్తుందని డాక్టర్ వెట్రివేల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more