Neera Café to make launching in Aug తెలంగాణ నీరాకు ఫుడ్ సేప్టీ లైనెన్స్.. ఆగస్టులో నీరా కేఫ్ షురూ..

Neera gets fssai license cafe to make debut in august

Neera, FSSAI, manufacture, packaging, sales, Neera by-products, jaggery, sugar, Nira syrups, Excise Minister Srinivas Goud, Toddy Tappers, Ambala Narayana Goud, Gouda Aikya Sadhana samithi Harsham, FSSAI License, Telangana

The Telangana government would certainly be beginning the Neera Cafe from the month of August as the item obtained the permit from the Food Safety as well as Standards Authority of India (FSSAI). Excise Minister V Srinivas Goud stated the State government has actually ambitiously presented the Neera plan for the development as well as well-being of toddy tappers in the state.

తెలంగాణ నీరాకు ఫుడ్ సేప్టీ లైనెన్స్.. ఆగస్టులో నీరా కేఫ్ షురూ..

Posted: 06/20/2022 03:29 PM IST
Neera gets fssai license cafe to make debut in august

తెలంగాణ ప్రజలతో ముడివేసుకున్న స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్రకృతి ప్రసాదినీ కల్లు. ఈ కల్లులో రెండు రకాలు అవే తాటి, ఈత. అయితే అత్యంత అరుదుగా కజ్జూర, కొబ్బరి, ఇలా పలు చెట్లకు కూడా కల్లును గీస్తారు. అయితే తెలంగాణలో మరీ ముఖ్యంగా పల్లెల్లో పండగైనా, పబ్బమైనా.. అహ్లాదమైనా.. అన్నింటికీ కల్లుతో ముడిపడిన జీవితాలే ఉండాయి. ఇక ఈ పల్లెల్లో అత్యంత అధికంగా డిమాండ్ ఉండే కల్లు తాటి, లేదా ఈత. అన్ని కాలలో విపరీతంగా అమ్మకాలు సాగించేంది మాత్రం ఈత కల్లు. ఈ కల్లును గీత కార్మికులు వ్యాపారదోరణిలోనే చూసేవారు.

అయితే కల్లు మాత్రమే కాకుండా నీరాను కూడా వ్యాపారధోరణిలో చూసేలా అలోచనలు వున్నా అది సాధ్యం కాలేదు. ఇక కేవలం గీతకార్మిక కుటుంబాలు మాత్రమే సేవించిన నీరాను ఇక రాష్ట్రవ్యాప్తంగా అందిరీకీ అందుబాటులోకి తీసుకురావాలని గీత సంఘాలు భావించాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గీత కార్మికులకు ప్రయోజనార్థం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానాలతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యనగరాల్లో నీరా కేప్ లు ఏర్పాటు కానున్నాయి. చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు అందరూ నీరాను ఆస్వాదించవచ్చు.

ఉదయం ఏమీ తినకుండా నీరాను తగు మోతాదులో సేవిస్తే అనేక శరీర రుగ్మతలు నయం అవుతాయని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ కేప్ లలో కేవలం నీరాను మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. అయితే నీరాతో పాటుగా దాని సహ ఉత్పాదనలు నీరా ఉత్ప‌త్తుల దిశ‌గా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి సోమ‌వారం కీల‌క ఆమోదం ల‌భించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి లైసెన్స్ ల‌భించింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఈ లైసెన్స్ తెలంగాణ నీరా చ‌రిత్ర‌లోనే ఓ సువర్ణాధ్యాయంగా అభివ‌ర్ణించారు. స‌హ‌జ‌సిద్ధంగా చెట్ల నుంచి వ‌స్తున్న నీరాను గ‌త ప్రభుత్వాలు నిర్ల‌క్ష్యం చేశాయ‌ని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నీరా మ‌త్తు ప‌దార్థం కాద‌ని, ఔష‌ధ గుణాలున్న స‌హ‌జ‌సిద్ధ ద్రావ‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దీనిని ప్రోత్స‌హించేందుకు నెక్లెస్ రోడ్‌లో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నీరాతో పాటు నీరా ఉత్ప‌త్తుల విక్ర‌యాల‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles