Setback to Araku MLA Chetti Palguna in his own constituency సొంత నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేకు పరాభవం..

Setback to araku mla chetti palguna women pulled his scarf on land encroachment allegations

Setback to Araku MLA Chetti Palguna, Setback to YSRCP MLA Chetti Palguna, Land encroachment acquisitions, YSRCP MLA, Chetti Palguna, madagada village, Araku MLA, Land encroachement, Araku, Vizag, Visakhapatna, Andhra Pradesh, Politics

Starting this academic year, students of CBSE, ICSE, IB and other board-affiliated schools will have Telugu as a second language in Class X board exams. It has also been made mandatory for all schools, irrespective of affiliation to boards and medium of instruction, to teach Telugu as a language for all classes from this year.

ITEMVIDEOS: సొంత నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేకు పరాభవం.. దాడికి యత్నించిన మహిళలు

Posted: 06/16/2022 12:54 PM IST
Setback to araku mla chetti palguna women pulled his scarf on land encroachment allegations

విశాఖలో అధికార ప్రతినిధి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు వివరించేందుకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను చూడగానే రంకెలేసిన మహిళలు మెడలోని కండువా పట్టుకుని దాడికి యత్నించారు. దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు మధ్యలోకి వచ్చి వారిని దూరంగా జరిపారు. రంగంలోకి దిగిన పోలీసుల రక్షణ మధ్య ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం మాడగడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్యే మాడగడ గ్రామానికి చేరుకున్నారు. ఆయనను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు గిరిజన మహిళలు.. ‘‘చెప్పండీ సారు చెప్పండీ మా భూములను ఎందుకు ఆక్రమించుకున్నారు.?’’, ఈ లోగా మరో మహిళ ఎమ్మెల్యే మెడలోని కండువాను పట్టుకుని ‘‘మా భూములను కబ్జా చేసి మళ్లీ మా ఊరే వస్తావా?’’ అంటూ నిలదీసింది.

గిరిజనులందరూ గుమికూడి ఆయనపైకి ఎగబడి దాడికి యత్నించేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి చేయిదాటుతుందని భావించిన ఆయన వెంటనే అప్రమత్తమైన తన మెడలోని కండువాను పట్టుకున్న మహిళ చేతులను వెనక్కి నెట్టారు. ఈలోగా వైసీపీ కార్యకర్తలు మధ్యలోకి వచ్చి వారిని అక్కడి నుంచి వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా రంగంలోకి దిగి వారిని అడ్డుకుని దూరంగా తీసుకెళ్లారు. అయినా శాంతించని గ్రామస్థులు భూములను కబ్జా చేస్తావా? అని దుర్భాషలాడుతూ వెంబడించారు. దీంతో చేసేది లేక పోలీసులు, వైసీపీ కార్యకర్తల రక్షణ మధ్య అక్కడి నుంచి ఆయన బయటపడ్డారు.

అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ స్పందించారు. తాను ఎలాంటి భూములను ఆక్రమించలేదని చెప్పుకచ్చారు. భూముల కబ్జా ఆరోపణలన్ని వారిని ప్రేరేపించి ఉపిగొల్పిన చర్యలేనని అన్నారు. తాను బ్యాంకు ఉద్యోగిగా ఉన్న సమయంలో 2012లో గోమంగి మధుసూదనరావు నుంచి సర్వే నంబరు 82లో ఉన్న 5.72 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడీ భూముల ధరలు పెరగడంతో కావాలనే తాను ఆ భూమిని కబ్జా చేసినట్టు ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కసుతోనే వారు తనపై అలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles