Congress protest outside Hyderabad Raj Bhavan కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తం.. లాఠీచార్జ్.!

Tension erupts in khairatabad amid congresss chalo bhavan several leaders arrested

TPCC Chalo Raj Bhavan, Hyderabad police, Khairatabad, Congress Chalo Raj Bhavan, Hyderbad police arrests congress leaders, Revanth Reddy, Jagga Reddy, Mallu BhattiVikramarka, Renuka Chowdary, NSUI activists, Youth Congress Activists, National Herald, Somajiguda to Raj Bhavan Rally, Rahul Gandhi, Enforcement Directorate, Congress Leaders, Party Activists, Vendetta Politics, Telangana, Politics

The Chalo Raj Bhavan in Hyderabad has become a hotbed of controversy in the wake of the trial of top Congress leader Rahul Gandhi in the National Herald money laundering case. Congress leaders decided to hold a rally from Somajiguda to Raj Bhavan.

ITEMVIDEOS: కాంగ్రెస్ ఆందోళనలతో అట్టుడికిన ఖైరతాబాద్.. పలువురి నేతల అరెస్టు.!

Posted: 06/16/2022 02:31 PM IST
Tension erupts in khairatabad amid congresss chalo bhavan several leaders arrested

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ​గాంధీని ఈడీ విచారించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా సోమాజీగూడ వద్ద నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లాలని పూనుకున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేయడం.. అడ్డుకోవడంతో శాంతియుతంగా జరగాల్సిన ఆందోళన కార్యక్రమం కాస్తా రణరంగంగా మారింది. సహనం కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఓ ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. అంతటితో శాంతించని కొందరు ఆగంతకులు.. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని ఉన్న మెట్రోలైనర్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

కాంగ్రెస్ నిరసన కార్యక్రమాల్లో పాల్గోన్న మహిళా కాంగ్రెస్ నేతల అరెస్టుకు పోలీసులు యత్నించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల తీరుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. తనను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. తనను చుట్టుముట్టిన పోలీసులతో గొడవ పడ్డారు. ఈ క్రమంలో పంజాగుట్టకు చెందిన ఎస్ఐ అమెను అడ్డుకోబోగా.. అతడి కాలర్ పట్టుకుని ‘‘నన్నే పట్టుకుంటావా.. స్టేషన్ కు వచ్చి మరీకొడతా’’, ‘‘నాపై చేయివేస్తే పార్లమెంటు వరకు ఈడ్చుకెళ్తానని’’ పైర్ అయ్యారు. అయినా పోలీసులు అమెను అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలిచారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు రాజ్ భవన్ పై వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డిని స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు. తమ శాంతియుత అందోళనకు పోలీసులు అడ్డుకోవడంతో యువజన కాంగ్రెస్ నేతల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనానికి యువనేతలు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

రాజ్‌భవన్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించి కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ కి దిగారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో నిరసనకారులు ఉండకుండా చెదరగొట్టారు. పోలీసుల దుర్భేధ్యాన్ని చేధించుకుని వచ్చిన యువనేతలను పోలీసులు అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరు మహిళా నేతలను సైతం పోలీసులు అక్కడి నుంచి తరలించారు. కాగా యువనేతలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి రణరంగంగా మారింది. కీలక నేతలను అదుపులోకి తీసుకున్నప్పటికీ… రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులను కూడా లెక్కచేయకుండా వారిని నెట్టి కిందపడేసి.. పక్కటెముకలు విరిగేలా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అక్షేపిస్తున్నారు. రాహుల్ గాంధీ త్వరలోనే దేశవ్యాప్త పాదయాత్రకు సన్నాహం అవుతున్న తరుణంలో ఆయనను ఏదో ఒక కేసులో ఇరికించి వేధించాలన్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ విచారణ తెరపైకి వచ్చిందని కూడా కాంగ్రెస్ నేతలు అరోపణలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles