Monsoon rains for next two days in Telangana తెలంగాణలో రానున్న రెండు రోజులు వర్షాలు.!

Telangana likely to witness monsoon rains in next 2 days says imd

IMD update, IMD alert, imd rainfall uodate, monsoon 2022, monsoon 2022 uodate, monsoon kerala, monsoon telangana, monsoon tamil nadu, monsoon karnataka, Monsoon, monsoon predictions, telangana Rains, telangana rainfal, Hyderabad rains, Warangal weather update, Hyderabad weather, weather, Hyderabad, Telangana Weather Update, where is it raining, Telangana monsoon, Telangana

The Meteorological Centre at Hyderabad has reported that Telangana is set to receive rainfall in the next two days. Meteorological Centre Hyderabad scientist Sravani stated that the monsoon had a wide spread over Telangana.

విస్తరించిన నైరుతి.. రానున్న రెండు రోజులు వర్షాలు.. అధికారులు అప్రమత్తం

Posted: 06/16/2022 11:36 AM IST
Telangana likely to witness monsoon rains in next 2 days says imd

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉత్తర-దక్షిణ ఉపరితలద్రోణి ఏర్పడింది. దీంతో రెండ్రోజుల పాటు పలు జల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  

రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన రెండ్రోజుల్లోనే పలు ప్రాంతాల్లో కంభవృష్టి కురుస్తోంది. ఫలితంగా హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఇవాళ మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు జిల్లా మీదుగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని పేర్కోంది. ఇవాళ విజయవాడ జిల్లాతో పాటుగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అర్ధరాత్రి సమయం నుంచి విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి

మరోవైపు దేశవ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కూడా బుధవారం అర్ధరాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఎండలతో విలవిలలాడిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అస్సాం రాజధాని గౌహతిలో కొండచరియలు విరిగి పడిన ఘటనలు నమోదయ్యాయి. ఫలితంగా అస్సాం వరదలతో గీతానగర్​, సోనాపూర్​, కలాపహార్​, నిజార్​పార్​ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. అనిల్​ నగర్​, నిబిన్​ నగర్​, రాజ్​గర్​ లింక్​ రోడ్డు, రుక్మిణిగావ్​, హటిగావ్​ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. మంగళవారం బోరేగావ్​ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు సజీవ సమాధి అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles