Lion Escapes a Stream Infested with 40 Crocodiles నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. సింహం సింగిల్ గానే..!

Viral video lion escapes a stream infested with 40 crocodiles in masai mara national reserve

Lion stranded on hippo carcass saves itself from 40 crocodiles, Lion on hippo carcass saves itself from 40 crocodiles, Lion on hippo saves itself from crocodiles, viral video, lion on hippo viral video, lion saves itself from 40 crocodiles video, viral news, 40 Crocodiles, Kenya, Lion Escapes Crocodiles, Masai Mara National Reserve, viral, Viral Animal Videos, viral news, Viral Videos

A viral clip from Kenya's Masai Mara National Reserve shows a lion crossing a stream infested with over 40 crocodiles. The video was posted on Youtube by a channel named Facts Tell that says that the predictor stranded on top of a hippo carcass and then managed to escape by running straight through about 40 crocodiles surrounding it.

ITEMVIDEOS: నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. సింహం సింగిల్ గానే..!

Posted: 06/15/2022 09:30 PM IST
Viral video lion escapes a stream infested with 40 crocodiles in masai mara national reserve

సోషల్‌ మీడియాను మరో వీడియో హల్ చల్ చేస్తోంది. గజేంద్ర మోక్షం గుర్తుందా.. అచ్చంగా అలాంటి ఘటనే.. అయితే తన తెలివితేటలను, బలాన్ని నమ్ముకున్న మృగరాజు.. సమయస్పూర్తితో వ్యవహరించి.. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది. తన చుట్టూ వలయంగా ఏర్పడిన మకరాలన్నింటినీ చాకచక్యంగా దాటి.. తన ప్రాణాలను నిలుపుకుంది. దైవాన్ని నిజమైన ఆపదలోనే అర్థిద్దామని అనుకుందో.. లేక తాను అడవికి రారాజు అని మరోమారు ప్రపంచానికి చాటాలని భావించిందో తెలియదు కానీ.. మకరాలను తప్పించుకుని నదిని దాటి సింహం వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

తనకు పట్టులేని స్థానబలం.. మకరాలకు అచ్చోచ్చిన స్థానం. అందులోనూ వాటిదే అక్కడ రాజ్యం. ఏదో ఒకటో, రెండో కాదు.. ఏకంగా 40 వచ్చి చుట్టూ వలయంగా ఏర్పడినా.. ఏ మాత్రం జంకకుండా.. ఆత్మస్థైర్యం కోల్పోకుండా.. సింహం వాటిని నుంచి తప్పించుకునే తరోణోపాయాన్ని అలోచించింది. నీళ్లలో మొసళ్ల చేతికి చిక్కి చచ్చిపడివున్న ఖడ్గమృగ శవం తేలుతుండగా, దానిపై నుంచి ఓ వైపుకు చేరుకునేందుకు చివరకు వచ్చింది. పట్టుతప్పి నీళ్లలో పడిపడగానే.. ఇక ఆలస్యం వద్దంటూ.. మకరాలపైనే అడుగులు వేస్తూ.. నదిఒడ్డుకు చేరింది. గుంపులుగా వచ్చిన మకరాల నుంచి సింహం సింగిల్ గానే తప్పించుకుందిగా.? అంటూ నెట్టిజనులు కామెంట్లు పెడుతున్నారు.

కెన్యా మసాయ్‌ మరా నేషనల్‌ రిజర్వ్‌ పార్క్‌లో మే 23వ తేదీన ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే దాని మీద ఓ సింహం కూడా కనిపించింది. దీంతో పెసీ తన కెమెరాతో షూట్‌ చేయడం ప్రారంభించాడు. సుమారు నలభైకి పైగా మొసళ్లు.. హిప్పో మృతదేహం చుట్టూ చేరాయి. కాస్త ఉంటే.. పైన ఉన్న సింహం కూడా వాటికి బలి అవుతుందేమో అనుకున్నాడు పెసీ. అయితే ప్రాణ భయంతో హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అదను చూసి నీళ్లలోకి ఒడ్డుకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles