Israeli scientists develop single-injection HIV treatment ఒకే ఒక్క ఇంజక్షన్ తో ఎయిడ్స్ వైరస్ కు చెక్.!

One time treatment for hiv aids a single injection is all that you may need

HIV, HIV Aids, What is HIV Aids, HIV Aids vaccine, Aids treatment, Aids symptoms, What is Aids, Aids precautions, Vaccine Against AIDS, aids, AIDS Treatment, AIDS Vaccine, AIDS Treatment, AiDS injection, AIDS Israel scientists, Science News, Health News

A new and unique treatment for AIDS which may be developed into a vaccine or a one time treatment for patients with Human Immunodeficiency Virus (HIV) could soon be available. The treatment, offered by researchers from Tel Aviv University, will help type B white blood cells secrete anti-HIV antibodies in the patient's body in response to the virus.

ఒకే ఒక్క ఇంజక్షన్ తో ఎయిడ్స్ వైరస్ కు చెక్.! వైద్యుల ఘనత.!!.

Posted: 06/15/2022 08:37 PM IST
One time treatment for hiv aids a single injection is all that you may need

ఎయిడ్స్‌.. ప్రాణాంత‌క సుఖవ్యాధి. ఈ వ్యాధి సోకినవారికి మరణమే శరణ్యమని తెలుసు. అయితే వారి జీవితకాలన్ని పెంచేందుకు.. ఇన్నాళ్లు వైద్యులు చికిత్సలు చేసి మందులు ఇచ్చారు. అయితే ఎంత చికిత్స చేసుకున్నా.. ఈ వ్యాది సోకిందంటే మరణం ముంచుకోస్తుందని తెలియనిది కాదు. ఈ వ్యాధి వ్యాధిగ్ర‌స్తుడి ర‌క్తాన్ని ఎక్కించ‌డం ద్వారా కానీ, లేదా ఈ వ్యాధి ఉన్న‌వారితో లైంగిక సంబంధం వ‌ల్ల కానీ ఈ వ్యాధి సోకుతుంది. ఇది మాన‌వుడి రోగ నిరోధ‌క శ‌క్తిపై దాడి చేస్తుంది. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు ఈ వ్యాధి సోక‌డంతో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌తో పాటు సామాజికంగా వెలికి గురి కావ‌డం ఈ వ్యాధిగ్ర‌స్తుల‌ను ఎక్కువ బాధ‌పెట్టేది.

కాగా అత్యాధునిక ఔష‌ధాల సాయంతో ఇప్పుడు ఈ వ్యాధిని స‌మ‌ర్ద‌వంతంగా నియంత్రించే చర్యలు చేపడుతున్నారు వైద్యులు. అయితే ఇప్పుడే అందుబాటులోకి వచ్చిన సరికొత్త వైద్యంతో ఎయిడ్స్‌(అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్‌) నుంచి ఇట్టే బయటపడవచ్చు. ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవీ(హ్యూమ‌న్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైర‌స్‌) ద్వారా సోకే ఈ వైర‌స్‌ను స‌మూలంగా నాశ‌నం చేయ‌డం ద్వారా ఎయిడ్స్‌ను న‌యం చేసే కొత్త విధానాన్నిఇజ్రాయెల్ దేశానికి చెందిన శాస్త్ర‌వేత్తలు క‌నుగొన్నారు. వీరు అభివృద్ధి చేసిన విధానం ప్ర‌కారం.. కేవ‌లం ఒకే ఒక్క ఇంజిక్ష‌న్ తీసుకోవ‌డం ద్వారా ఈ వ్యాధి నుంచి కోలుకోవ‌చ్చు.

వైర‌స్ చికిత్స‌ల్లో ఇదొక మైలురాయిగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఎయిడ్స్‌ను న‌యం చేసే ఆ ఇంజిక్ష‌న్ లేదా వ్యాక్సిన్‌ను జీన్ ఎడిటింగ్ విధానం ద్వారా రూపొందించారు. హెచ్ఐవీని నాశ‌నం చేయ‌గ‌ల‌ రోగ నిరోధ‌క శ‌క్తిని యాక్టివేట్ చేసే టైప్ బీ తెల్ల ర‌క్త క‌ణాల్లో మార్పు చేయ‌డం ద్వారా హెచ్ఐవీని నాశ‌నం చేసే విధానాన్ని శాస్త్ర‌వేత్త‌లు రూపొందించారు. ప్రాథ‌మికంగా ఈ విధానం విజ‌య‌వంత‌మైంద‌ని, ఇంకా పూర్తి స్థాయిలో ప‌రిశోధ‌న జ‌ర‌పాల్సి ఉంద‌ని టెల్ అవీవ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు తెలిపారు. ఈ ప‌రిశోధ‌న ఫ‌లితాల‌ను నేచ‌ర్ ప‌త్రిక‌లో ప్ర‌చురించారు.

ఈ ప‌రిశోధ‌న ఫ‌లితాల‌ను మ‌రింత విస్తృతం చేయాల్సి ఉంద‌ని, త‌ద్వారా అంటువ్యాధులే కాకుండా, కేన్స‌ర్‌ను, ఇత‌ర ఆటో ఇమ్యూన్ వ్యాధుల‌ను న‌యం చేసే ఔష‌ధాలను రూపొందించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. బీ వైట్ బ్ల‌డ్ సెల్స్ వైర‌స్‌, బ్యాక్టీరియాల‌కు వ్య‌తిరేకంగా యాంటీబాడీల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. ఇవి బోన్ మ్యారోలో ఉత్ప‌త్తి అవుతాయి. అక్క‌డి నుంచి ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వస్థ‌లోకి, అక్క‌డి నుంచి వివిధ శ‌రీరాంగాల‌కు వెళ్తాయి. ఇప్పుడు శాస్త్ర‌వేత్త‌లు ఈ బీ సెల్స్‌లో అవ‌స‌ర‌మైన జీన్ ఎడిటింగ్ చేసి, హెచ్ఐవీని నాశ‌నం చేయ‌గ‌ల యాంటీబాడీల‌ను ఉత్ప‌త్తి చేయ‌గ‌లిగారు. వైర‌స్ మ్యూటేష‌న్‌ల‌కు అనుగుణంగా ఈ బీ సెల్స్ కూడా మార్పు చెంద‌డం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles