Veterinary doctor kidnapped, forcefully married to girl in Bihar పశువుల వైద్యుడ్ని అపహరించి.. బలవంతంగా పెళ్లి..

Pakadwa vivah veterinarian abducted and forcibly married in bihar s begusarai

Pakadwa Vivah, Bihar Veterinarian Kidnapped, Bihar Groom Abduction, Bihar Forced Marriages, What is Pakadwa Vivah, Pakadwa Vivah, Veterinarian, pretext of checking on sick animal, abduction. forcibly marriage, Begusarai district, Bihar, Crime

A veterinary doctor was abducted and forcibly married in the Begusarai district of Bihar. The veterinarian was called to the house on the pretext of checking a sick animal and was later kidnapped by three men. He was called around 12pm to check on a sick animal, after which 3 people kidnapped him.

ఇదో రకం కళ్యాణం: పశువుల వైద్యుడ్ని అపహరించి.. బలవంతంగా పెళ్లి..

Posted: 06/15/2022 07:23 PM IST
Pakadwa vivah veterinarian abducted and forcibly married in bihar s begusarai

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అఘాయిత్యాలు జరిగేవన్నీ యువతులు, మహిళలు, బాలికలపైనే. అయితే గత కొంతకాలం క్రితం స్వలింగ సంపర్కం వెలుగు చూసినా అది ఇద్దర వ్యక్తులు ఇష్టపడి చేసుకునే రకమేనని తేలింది. ఇక ఎక్కడో అఫ్రికన్ దేశాల్లో మాత్రం మగవారిపై మహిళలు అఘాయిత్యాలకు పాల్పడతారని వార్తల్లో విన్నాం. వీరు మగవారిని నిర్ఝన ప్రాంతానికి అపహరించి తీసుకెళ్లి.. వారి వీర్యాన్ని సేకరిస్తారు. మగవారి వీర్యానికి అక్కడ భలే డిమాండ్ మరీ. అంతేకాని అఘాయిత్యాలకు మాత్రం తెగబడరు.. అపహరించి మూడుముళ్లు వేయరు.

ఈ విషయాలను పక్కనబెడితే.. మనదేశంలో మగవారిని అపహరించి పెళ్లి చేసుకునే వారున్నారన్న విషయం మీకు తెలుసా..? ఇన్నాళ్లు కేవలం ఒంటిరి అమ్మాయిలను టార్గెట్ చేసి వారిపై అఘాయిత్యాలకు తెగబడిన నేరగాళ్లకు చూశాం. ఇక అమ్మాయిలను ఇష్టపడి వారు నిరాకరించడంతో వారిపై ప్రతీకారంగా ప్రాణాలను బలిగోన్న ప్రేమోన్మాదులను చూశాం. ఇక యువతులను అపహరించి వారిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు గురించి అప్పుడప్పుడూ అక్కడక్కడా విన్నాం. కానీ అబ్బాయిలను కిడ్నాన్‌ చేసి పెళ్లిచేకోవడం గురించి ఇంతవరకు వినలేదు కదా.

కానీ నేటి సమాజంలో నేరంలోనూ ఆడవారు సగమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాము ఇష్టపడ్డ వ్యక్తిని అపహరించి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడోక పెళ్లి కానీ వెటర్నరీ వైద్యుడికి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని పశువైద్యధికారిని బెగుసురాయ్‌లో ముగ్గురు వ్యక్తులు పశువుకి వైద్యం చేసే నిమిత్తం రమ్మని పిలిచారు. దీంతో ఆ వైద్యడు సదరు గ్రామానికి వెళ్లాడు. అంతే ఆ ముగ్గురు వ్యక్తుల పశువైద్యాధికారిని కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసేశారు. ఈ విషయంలో వరుడి ఇంట్లోవాళ్లకు తెలియడంతో వాళ్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ మేరకు పశువైద్యాధికారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతేగాక ఆ రోజు నుంచి తన కొడుకు (పశువైద్యాధికారి) కనపించడం లేదని కూడా పోలీసులకు తెలిపారు. బెగుసురాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ మాట్లాడుతూ....బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ వంటి కొన్ని ప్రాంతాలలో ఇలానే పెళ్లి కాని అబ్బాయిలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తారని అన్నారు. అక్కడ ఇది చాలా సర్వసాధారణమని చెప్పారు. దీన్ని అక్కడ వరుడి కిడ్నాప్‌ లేదా పకడ్వా వివాహం అని పిలుస్తారని చెప్పారు. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరపడమే కాకుండా నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles