క్రాస్ ఓటింగ్, నిబంధనల ఉల్లంఘన, గంటల తరబడి జాప్యం వంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో హోరాహోరీగా సాగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఈ తెల్లవారుజామున వెల్లడయ్యాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 స్థానాలకు గాను బీజేపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితంగా ఎగువ సభలో మరింత బలాన్ని కూడగట్టుకుంది. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన స్థానాల్లో మహారాష్ట్రలోని శివసేన కూటమి, హర్యానాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని గెలుచుకుని అధికార కూటమికి షాకిచ్చింది. క్రాస్ ఓటింగ్‌పై వాగ్వివాదం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమైంది. ఇక్కడ గెలుపొందిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఉన్నారు. ఇక, మహారాష్ట్రలోని అధికార ఎంవీఏ (మహారాష్ట్ర వికాస్ అఘాడీ) కూటమి బరిలోకి దింపిన అభ్యర్థుల్లో శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్‌సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి విజయం సాధించారు.
తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ, శివసేన రెండూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. అటు రాజస్థాన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, బీజేపీకి చెందిన ఘనశ్యామ్ తివారీ రాజ్యసభకు ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మీడియా అధినేత సుభాష్ చంద్ర ఓటమి పాలయ్యారు.
హర్యానాలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ పోల్ అభ్యర్థి అజయ్ మాకెన్ తగినంత రాజ్యసభ ఎన్నికలలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ శాసనసభ్యుడు క్రాస్ ఓటింగ్ కారణంగా ఆయన ఓటమి పాలయ్యారు. ఓట్లు సాధించడంలో విఫలమై ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత కృషన్‌లాల్ పన్వర్, కాషాయ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కార్తికేయ శర్మకు క్రాస్ ఓటింగ్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధీకృత పోలింగ్ ఏజెంట్ బీవీ బాత్రా ఆరోపించారు.
కర్ణాటకలోనూ అధికార బీజేపీ రాజ్యసభ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసింది. కర్ణాటకలో మూడు స్థానాలకు పోటీ చేసిన అధికార బీజేపి.. అనుకున్నట్లుగానే మూడు స్థానాలను గెలుచుకుంది. మొత్తంగా నాలుగు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని కైవసం చేసుకోగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఓ స్థానంతో సరిపెట్టుకుంది. జేడీఎస్ మాత్రం రిక్తహస్తాలతో మిగిలిపోయింది. గెలుపొందిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, నటుడు, రాజకీయ నేత జగ్గేష్, లెహర్ సింగ్ సిరోయా విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జైరాం రమేశ్ విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more