Lucknow boy who killed mother over PUBG sent to juvenile home పబ్ జీ హత్య: విచారణలో విస్మయం గొలిపే విషయాల వెల్లడి.!

Murder over pubg lucknow boy went to play cricket after killing mother

Lucknow boy, PUBG, Boy kills mother over PUBG, Online gaming, juvenile home, Lucknow, PUBG, Lucknow PUBG murder, Murder over PUBG, Mobile game addiction, murder over mobile games, Uttar Pradesh, UP, crime

The 16-year-old Lucknow boy, who had allegedly killed his mother over the PUBG mobile game, went to play cricket hours after committing the crime. He locked his younger sister in another room amid unbearable stench emanating from the victim's body. PUBG, a multi-player shooting game, was banned in India but was replaced by BGMI.

పబ్ జీ గేమ్ హత్య: విచారణలో విస్మయం గొలిపే విషయాలు వెల్లడించిన బాలుడు.!

Posted: 06/10/2022 09:58 PM IST
Murder over pubg lucknow boy went to play cricket after killing mother

ఆన్ లైన్ గేముల్లో పడి అమ్మ, నాన్న, అక్కా, చెల్లి, అన్నా తమ్ముడు అన్న అనుబంధాలకు కూడా రేపటి తరం దూరం అవుతున్నారు. అందుకు ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో జరిగిన ఈ దారుణఘటనే ఉదాహరణ. ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో పిల్లలపై తల్లితండ్రులే కాకుండా వారి అన్నదమ్ములు, అన్నదమ్ముల పిల్లలు, తాత, నానమ్మలతో పాటు పోరుగింటి వారి పర్యవేక్షణ కూడా ఉండేది. ఈ ఉమ్మడి కుటుంబాలు కాస్తా.. తరాలు మారగా, ఎవరి కుటుంబం వారిదైంది. దీంతో చినాన్న, పెద్దనాన్నలు, అన్నదమ్ములు, దూరమయ్యారు.

వారి నుంచి తమ పిల్లలను తప్పించగలుగుతున్నామని తల్లిదండ్రులు అనుకున్నారే కానీ.. వారి పర్యవేక్షణ, ప్రేమ, అప్యాయత, జ్ఞానంతో వారి ఉన్నతికి ఎంతగా దోహపడతాయో అర్థం చేసుకోలేకపోతున్నారు. తమ పిల్లలు ఎన్నో తెలియని విషయాలను తెలుసుకోవడంతో పాటు కలసిఉంటే ఎంత సుఖమో కూడా తెలుసుకునే వెసలుబాటు ఉంటుంది. ఉద్యోగాల పేరుతో కొందరు, వ్యాపారాల పేరుతో మరికొందరు ఇలా ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా విడిపోయి బతకడంలోనే సుఖాని కోరుకున్నారు. దీంతో పిల్లల కొంత వయస్సు రాగానే తల్లిదండ్రుల నుంచి స్వేఛ్చ కోరుకుంటున్నారు.

నీవు నేర్పిన విద్యే నిరజాక్ష అన్నట్లు.. తల్లిదండ్రులు మా కుటుంబం అని భావించి విడిపోగా, వారి బిడ్డలు.. నేను అంటూ విడిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ తల్లి మరణానికి ఆ బిడ్డ స్వేచ్ఛ కోరుకోవడమే కారణమైంది. ఇక పిల్లల్లో ఎంతటి కరుడుగట్టిన తత్త్వం.. ఎంతటి నేర ప్రవృత్తి పెరుగుతుందో ఈ ఘటన కళ్లకుకడుతోంది. పబ్ జీ మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకున్నందన్న ఆగ్రహంతో తల్లిని రివాల్వర్ తో కాల్చి చంపిన ఘటనలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగు చూశాయి. యూపీలోని లక్నోలో ఐదు రోజుల క్రితం (గత ఆదివారం రాత్రి) 16 ఏళ్ల బాలుడు తన తల్లి సాధన (40)పై కాల్పులు జరపగా, ఆమె ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

మూడు రోజుల తర్వాత తల్లి మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో అతడు కోల్ కతాలో పనిచేస్తున్న తన తండ్రి, ఆర్మీ ఉద్యోగికి కాల్ చేసి చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు బాలుడిని విచారించగా, అతడు చెప్పిన విషయాలు విని అధికారులకు తల తిరిగినంత పనైంది. నిజానికి బాలుడు తుపాకీతో కాల్పులు జరిపిన వెంటనే సాధన ప్రాణాలు కోల్పోలేదు. గాయాలతో పడిపోయిన ఆమెను అలాగే గదిలో వదిలేసి బాలుడు బయట గడియ పెట్టాడు. తన సోదరిని మరో గదిలో బంధించాడు. మరుసటి రోజు ఉదయం డోర్ తెరిచి చూడగా తల్లి శ్వాస తీసుకోవడం కనిపించింది.

తల్లి బతికి ఉందా? చనిపోయిందా? అని తాను తరచూ వెళ్లి తలుపు తీసి చూసినట్టు బాలుడు వెల్లడించాడు. కనీసం కాల్పులు జరిపిన మర్నాడు ఉదయం అయినా అతడు విషయాన్ని ఎవరికైనా చెప్పి ఉంటే సాధన బతికి ఉండేదని పోలీసులు అంటున్నారు. పబ్ జీ ఆడనీయనందుకే తండ్రి రివాల్వర్ తో కాల్చానని అతడు చెప్పాడు. అంతేకాదు, మరుసటి రోజు తల్లి మృతదేహాన్ని ఇంటి నుంచి తరలించేందుకు స్నేహితుడి సాయాన్ని కూడా కోరాడు. రూ.5,000 ఇస్తానని ఆఫర్ కూడా చేశాడట. అంతేకాదు, ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని స్నేహితుడిని బెదించినట్టు కూడా పోలీసులకు తెలిపాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles