AIMIM to vote for MVA in Maharashtra Rajya Sabha polls రాజ్యసభ ఎన్నికలలో బద్దశత్రువుతో చేయి కలపిన శివసేన.!

Aimim backs shiv sena led alliance as voting for 16 rajya sabha seats begins

Rajya Sabha polls, AIMIM, Shiv Sena, Maha Vikas Aghadi, Two MIM MLAs, Congress candidate, Imran Pratapgarhi, Maharashtra, politics

The AIMIM has decided to back the Maha Vikas Aghadi in the upcoming Rajya Sabha polls in Maharashtra. The two MLAs will vote for Congress candidate Imran Pratapgarhi. This was tweeted by Imtiaz Jaleel, the AIMIM MP from Aurangabad, hours before the polling.

రాజ్యసభ ఎన్నికలలో బద్దశత్రువుతో చేయి కలపిన శివసేన.!

Posted: 06/10/2022 08:58 PM IST
Aimim backs shiv sena led alliance as voting for 16 rajya sabha seats begins

రాజకీయాల్లో శాశ్వత శత్రువుల, శాశ్వత మిత్రులు ఉండరన్నది ఉవాచ. అలాగే.. తమతో వైరం ఉన్న పార్టీని మట్టికరిపించేందుకు.. అదే బావజాలం కలిగిన పార్టీలన్ని కూడా ఓక్కటిగా మారడం కామన్. రాజకీయాల్లో ఎప్పుడు ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో.. తమ ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేయడమనేది చాలా అవసరం. ఆ మేరకు పావులు కదుపుతూ.. తమతో కలసివచ్చే వారితో.. ఎలా మాట్లాడించాలన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతీ పరిణామాన్ని ప్రత్యర్థి పార్టీలతో పాటు ప్రజలు, మరీ ముఖ్యంగా ఓటర్లు గమనిస్తూనే ఉంటారు. ఓటరు దేవుళ్లకు అనుకూలంగానే వీరు వ్యవహరించాల్సి ఉంటుంది.

ఆ మధ్య ఓ రాజకీయనేత రైతులు తిండిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నది వాస్తవం కాదు.. తిండి ఎక్కువై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యనించారు. దీంతో ఆ తరువాత రెండు పర్యాయాలు ఆయన వరుస ఓటములను చవిచూడాల్సి వచ్చింది. ఇక వ్యవసాయం దండగ అన్న రాజకీయ నేత పార్టీని కూడా అధికారంలోకి రానీయకుండా చేసింది ఓటర్లే. వీరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ.. ఆత్మాభిమానం దెబ్బతినేలా మాత్రం వ్యాఖ్యానించరాదు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు అవసరానికి తగ్గట్టుగా తమ నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తన ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది.   

మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఈ కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఈ మేరకు ఎంఐఎంకు చెందిన ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, శివసేనతో తమకున్న సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రం ఇకపై కూడా కొనసాగుతాయని ఆయన అనడం కొసమెరుపు. తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ధూలియా, మాలేగావ్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలను ప్రభుత్వానికి చేశామని ఇంతియాజ్ చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. ఏదేమైనప్పటికీ శివసేన కూటమితో ఎంఐఎం చేతులు కలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles