Pawan Kalyan interesting tweet makes jana sainiks alert పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.. జనసైనికులు అలర్ట్.!

Janasena chief pawan kalyan interesting tweet makes jana sainiks alert

Pawan Kalyan latest tweet, pawan kalyan tweet on politics, pawan kalyan on parties prasing, pawan kalyan tweet hot topic, Pawan kalyan, Jana sena President, Jana Sena, BJP, Congress, TDP, Chandrababu, YSRTP, Twitter, Political parties, Andhra Pradesh, Politics

Janasena chief Pawan Kalyan recently made political comments in telangana which draw attention of political parties. Now the power star made interesting comments which mada Jana sainiks alert, and also became the hot topic in the political parties.

పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.. జనసైనికులు అలర్ట్.!

Posted: 06/09/2022 12:01 PM IST
Janasena chief pawan kalyan interesting tweet makes jana sainiks alert

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన ఈ అంశంపై అటు అనుకూల పక్షాలు, ఇటు వైరి పక్షాలు నిశితంగా పరిశీలించాయి. ఈ ప్రకటనలోనే ఓ మెట్టుదిగిన చంద్రబాబు అవసరం కాబట్టి తమ పార్టీ త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇదే పోత్తు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ... పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో వున్న వైసీపీ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలంటే అన్ని పార్టీలు ఒక్కటి కావాలని కూడా పిలుపునిచ్చారు. ఏకంగా మూడు ఆప్షన్లంటూ క్లియర్ కట్ హింట్ కూడా ఇచ్చారు.

దీంతో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు విమర్శలతో పవన్ కల్యాణ్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఒంటరిగా వెళ్తే గెలువలేమని పవన్ కల్యాణ్ కు ముందే తెలుసునని అందుకనే ఇలా ప్రతిపక్షాల అన్ని ఒక కూటమిగా తమపైకి దాడికి వస్తున్నాయని కూడా విమర్శలు చేశారు. ఇక మరికోందరు సింహం సింగిల్ గా వస్తుందంటూ సినిమా డైలాగుల వినిపించారు. వీటిపై స్పందించిన పవన్ కల్యాణ్.. సినిమా డైలాగులు వేరు రాజకీయాలు వేరని.. ఈ రెండింటినీ కలపాలని చూడవద్దని అధికార పక్షానికి సూచించారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటించారు.

అయితే ఆయన ఈ పోత్తు కూటములపై కానీ.. లేక పవన్ కామెంట్స్ పై గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతటితో ఆగని ఆయన రాష్ట్ర బీజేపి నేతలు కూడా పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయవద్దని అదేశించారు. ఇక జాతీయ స్థాయినేతలకు కూడా అవే ఆదేశాలు అమలుకానున్నాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల తరువాత జనసేన- బీజేపీల మధ్య ఏర్పడిన మిత్రబంధానికి భీటాలు వారాయా.? అన్న సందేహాలు కూడా రాజకీయ విశ్లేషకులతో ఉత్పన్నమయ్యాయి. బలవంతంగా మైత్రి కట్టేలా చేసిన పార్టీ.. ఇప్పుడు వపన్ కు పక్కనబెట్టింగా.? అన్న సందేహాలు తెరపైకి వస్తున్న క్రమంలో.. ఈ పరిణామాలన్నింటినీ క్రోడీకరించుకుని పవన్ చేసిన ఓ ఆసక్తికరమైన ట్వీట్ రాజకీయ చర్చకు తెరతీసింది.

రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారితే దాని వెనకాల ఉన్న కారణాలు తెలుసుకోవాలంటూ పవన్ రాసుకొచ్చారు.'అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు ఒక్కసారిగా పొగడటం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని భావించి చప్పట్లు, ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటివరకు తిట్టిన వారు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలి. పొగుడుతున్నారని ఆ నాయకుడిని ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే' అని తెలుసుకోవాలని పవన్‌ ట్వీట్‌ చేశారు.

మంగళగిరి వేదికగా జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో పవన్ పొత్తులపై మాట్లాడిన విషయం తెలిసిందే. “తనను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారనే బైబిల్ సూక్తిని తాను పాటిస్తానని, జగన్మోహన్‌ రెడ్డి బైబిల్‌ను పాటిస్తారో లేదో తెలియకపోయినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఎంతకైనా తగ్గుతానని, 2014, 19లో అలాగే వెనక్కి తగ్గానని, 2024లో కూడా తగ్గడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు”. ఇప్పటి వరకు అన్నిసార్లు తానే తగ్గానని, ఈసారి మిగిలిన పక్షాలు కూడా తగ్గితే బాగుంటుందన్నది తన అభిప్రాయమని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం మీద పత్రికల్లో వార్తలు రావడం తప్ప తనతో ఇంతవరకు ఎవరు సంప్రదించలేదని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. పదవుల కోసమే రాజకీయాలు చేయనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గడానికి తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు

జనసేన భవిష్యత్తులో అధికారాన్ని ఒక్కరిగా తీసుకున్నా, భాగస్వాములతో కలిసి తీసుకున్నా 2024లో ఏదొకటి ఖచ్చితంగా జరుగుతుందన్నారు. తన ముందు మూడు మార్గాలున్నాయని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం లేకుంటే జనసేన ఒక్కటే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమనే మార్గాలు ఉన్నాయని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. “తెలుగుదేశం పార్టీ కూడా బైబిల్‌ సూక్తిని పాటించాలని, తనను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారనే సూక్తిని టీడీపీ పాటించాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు.” తాము ఎప్పుడు తగ్గించుకునే ఉంటామని, ఈసారి ఎదుటి పక్షం తగ్గితే బాగుంటుందన్నది తన అభిప్రాయమని చెప్పారు. పోరాడితే పోయేదేమి లేదని జనసేన అధికారంలోకి రావడానికి పోరాడాలని పిలుపునిచ్చారు. తాజాగా మైండ్ గేమ్ అంటూ ఆయన ట్వీట్ చేయటం... ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles