Rare 5-Planet Alignment Is Taking Over The Sky ఖగోళంలో అద్భుతం.. ఈ నెల 24న అవిష్కృతం..

Dawn skies to reveal rare alignment of 5 planets moon in june

Mercury, Venus, Mars, Jupiter,Saturn, Moon, "beautiful" allignment of Planets, planets allignment line, Stardome Observatory, astronomy educator Josh Aoraki, Matariki, naked eye, binoculars, before sunrise

In a rare display, Mercury, Venus, Mars, Jupiter and Saturn will align, along with the moon, in sequential order from the sun. Stardome Observatory astronomy educator Josh Aoraki said it's "quite special" to be occurring in the same month as Matariki. He told stargazers should be able to spot the planets with the naked eye or binoculars around 30 minutes before sunrise. It's best to check when the sun will rise in your area to be safe.

ఖగోళంలో అద్భుతం.. ఈ నెల 24న అవిష్కృతం..

Posted: 06/08/2022 08:38 PM IST
Dawn skies to reveal rare alignment of 5 planets moon in june

ఈ నెలలో ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 24న ఆవిష్కృతం కానున్నది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. అయితే, అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్‌ల ద్వారా చూడొచ్చని, తెల్లవారు జామున ఐదుగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపించనున్నాయి. ఈ అరుదైన దృశ్యం 18 సంవత్సరాల తర్వాత కనిపించనున్నది. ఇంతకు ముందు చివరి సారిగా 2004 డిసెంబర్‌లో కనిపించింది.

అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సారి బుధుడు, శనిగ్రహాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండనున్నది. ఐదు గ్రహాలు సరళ రేఖలోకి రావడం చాలా అరుదని స్కై అండ్‌ టెలిస్కోప్‌ అబ్జర్వింగ్‌ ఎడిటర్‌ డయానా హన్నికెన్‌ తెలిపారు. ఈ గ్రహాలు చివరిసారిగా 2004లో కనిపించాయని, మళ్లీ 2040లోనే కనిపిస్తాయన్నారు. జూన్‌ మాసం గడిచేకొద్దీ బుధగ్రహాన్ని సులభంగా చూడొచ్చని, ఈ నెల 24న ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజున వీనస్, మార్స్ మధ్య చంద్రవంకను చూడొచ్చన్నారు. సూర్యోదయానికి అరగంట ముందు ఈ ఖగోళ అద్భుతం ఆవిష్కృతమవుతుందని చెప్పారు.

తూర్పు వైపు హోరిజోన్‌లో ఈ దృశ్యాన్ని బైనాక్యులర్‌ సహాయం చూడొచ్చని వివరించారు. చంద్రుడు భూమి చుట్టూ తన కక్ష్యను కొనసాగిస్తూనే ఇలా దర్శనమిస్తాడని తెలిపారు, కొన్ని రోజులలో గ్రహాలతో సమలేఖనం నుండి చంద్రుడు బయటపడతాడని తెలిపారు.ఇక జూలై నెల మధ్యలో సూపర్‌మూన్ కూడా దర్శనమివ్వబోతుందని ఆయన తెలిపారు. డెల్టా అక్వేరిడ్ ఉల్కాపాతం కోసం కూడా జూలైలో ఎదురు చూస్తారని అరోకి చెప్పా రు. చీకటి ఆకాశంలో ఉన్నట్లయితే వర్షం సమయంలో ప్రజలు గంటకు 20 ఉల్కలను చూడగలరని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles