Cordelia Cruise empress ship impresses travellers విశాఖ చేరిన కోర్డెలియా క్రూయిజ్.. సముద్రంపై స్టార్ హోటల్..!

Andhra pradesh cordelia cruise ship reaches visakhapatnam to start operations

Visakhapatnam luxury Cordelia, Cordelia Cruise ship, Visakhapatnam port, Indian Ocean coast, Visakhapatnam, Puducherry, Chennai, Cordelia Cruise Company, star hotel on sea, Visakhapatnam travellers

The luxury Cordelia Cruise ship reached Visakhapatnam port on Wednesday morning. The cruise, which sails along the Indian Ocean coast, travels through Visakhapatnam, Puducherry, and Chennai and returns to Visakhapatnam. 'This luxury ship that will be operated by the Cordelia Cruise Company looks like a star hotel floating on the ocean.

విశాఖ చేరిన కోర్డెలియా క్రూయిజ్.. సముద్రంపై స్టార్ హోటల్.. నేటి నుంచే కార్యకాలాపాలు.!

Posted: 06/08/2022 03:18 PM IST
Andhra pradesh cordelia cruise ship reaches visakhapatnam to start operations

సముద్రంపై తేలియాడే స్వర్గం అని అభివర్ణించబడే లగ్జరీ కార్డెలియా క్రూయిజ్ తమ సేవలను ఇకపై విశాఖ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇవాళ్టి నుంచి కార్డలియా క్రూయిజ్ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం విశాఖపట్నం పోర్టుకు క్రూయిజ్ చేరుకున్నది. హిందూ మహాసముద్రంపై తేలియాడే స్టార్ హోటల్ ను తలపించేలా అద్భుతంగా రూపుదిద్దుకోబడిన ఈ క్రూయిజ్.. స్థానిక విశాఖవాసులతో పాటు పలువురికి సముద్రంలో నౌకాయానం చేయాలన్న కోరికను తీర్చేందుకు వచ్చేసింది. ఈ క్రూయిజ్ హిందూ మహాసముద్ర తీరం వెంబడి ప్రయాణిస్తుంది.

విశాఖపట్నం నుంచి బయలుదేరి పుదుచ్చేరి, చెన్నై మీదుగా ప్రయాణించి తిరిగి విశాఖపట్నం చేరుకునే ఈ క్రూయిజ్ లో ప్రయాణించేందుకు అందునా తొలి పర్యటనలోనే తమ కోరికను తీర్చుకునేందుకు అనేకమంది పోటీపడ్డారు. ఇప్పటికే ఈ క్రూయిజ్ లో ప్రయాణించే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. మరీముఖ్యంగా చెన్నైకి టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రూయిజ్‌లో ప్రయాణించి ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకునేందుకు ఎందరో పర్యాటకప్రియులు ఎదురుచూస్తున్నారు. ఉదయాన్నే విశాఖ ఓడరేవుకు చేరుకోవడంతో దానిలో ప్రయాణించేందుకు చాలా మంది పర్యాటకులు ముందుకు వచ్చారు.

కార్డెలియా క్రూయిజ్ కంపెనీ నిర్వహించనున్న ఈ లగ్జరీ షిప్.. సముద్రంలో తేలియాడే స్టార్ హోటల్‌లా కనిపిస్తుంది. ఈ క్రూయిజ్ విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రయాణిస్తుంది. మూడు రాత్రులు – నాలుగు పగళ్ల టూర్ ప్యాకేజీని అందిస్తున్నది. ఈ నౌకలో ఒకేసారి 1500 మంది ప్రయాణించేందుకు వీలున్నది. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఈ షిప్‌కు 36 గంటల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం పట్ల కార్డెలియా క్రూయిజ్‌ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

కోర్డెలియా క్రూజ్ మొత్తం 11 అంతస్తులను కలిగి ఉన్నది. ఇందులో అనేక అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ప్యాసింజర్ లాంజ్ ఇంజిన్, కార్గో తర్వాత మూడో అంతస్తు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు వెళ్ళవచ్చు. 10వ అంతస్తులో పెద్ద టెర్రస్ వంటి డెక్ ఉంటుంది. దాని తర్వాత పదకొండో అంతస్తులో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా డెన్ ఏర్పాటు చేశారు. ఇది కోర్డెలియా కిడ్స్ అకాడమీ పిల్లల ఆటల కోసం ఒక పెద్ద క్యాంపస్, వ్యాయామశాల, స్విమ్మింగ్ పూల్, క్యాసినో, హాస్య ప్రదర్శనల కోసం ఆడిటోరియంలు, సినిమాల ప్రదర్శనల కోసం థియేటర్లు, 24-గంటల సూపర్ మార్కెట్‌ ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles