Man Dies After Detached Tyre From Truck Slams Him దుకాణం నుంచి బయటకొచ్చిన వ్యక్తిపైకి దూసుకొచ్చిన మృత్యువు..!

Tamil nadu man smashed to death after getting hit by a speeding truck s detached tyre

Man Dies After Detached Tyre From Truck Slams Him, sriperambudur area, accident in tn, road rage, road accident video, Murali, auto-rickshaw driver, Detached Tyre, Sriperambudur, Rajiv Gandhi Government Hospital, CCTV footage, Tamil Nadu, Crime

In a tragic accident, a 45-year-old man from Tamil Nadu lost his life after a truck tyre detached from the vehicle and slammed him at a very high speed. The CCTV footage which has been accessed by Republic TV shows a man walking along a road when a loose tyre came rolling at a high speed and slammed him.

ITEMVIDEOS: దుకాణం నుంచి బయటకొచ్చిన వ్యక్తిపైకి దూసుకొచ్చిన మృత్యువు..!

Posted: 06/08/2022 04:35 PM IST
Tamil nadu man smashed to death after getting hit by a speeding truck s detached tyre

ప్రాణులకు మ‌ర‌ణం ఎక్క‌డి నుంచి, ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అదే విధి అడే వింత నాటకమంటూ కోందరు.. ఆ పరమాత్ముడి లీల అంటూ ఇంకోందరు వ్యాఖ్యానిస్తుంటారు. రోడ్డుకు పక్కగా ఉన్న ఓ వ్యక్తి.. తన జేబులో తాను కొనుగోలు చేసే వస్తువు కోసం వేతుకాడో.. లేక తన ద్విచక్రవాహనం తాళం చెవులు కోసం అన్వేషించాడో తెలియదు కానీ.. ఆయన రోడ్డకు పక్కగా నిల్చున్న కొన్ని క్షణాలే అతనికి చివరి క్షణాలుగా మారాయి. అయితే ఏదో వాహనం వచ్చి ఆయనను ఢీకొన్నిందని భావిస్తే పోరబాటే.. కానీ అతని ప్రాణాలు మాత్రం అనంతవాయువుల్లో కలసిపోయాయి.

అక్కడ పెద్ద ఉపద్రవం ఏమీ లేదు.. అంతా సాదాసీదాగానే ఉంది. కానీ క్షణాల్లో దుకాణం నుంచి బయకోచ్చిన వ్యక్తిని మృత్యుశకట చక్రం బలితీసుకుంది. ఇదే మరణం ఎలా వస్తుందనేందుకు ఘటనకు ఉదాహరణ. అయితే అక్కడివారంతా ఏం జరిగిందీ.. అని తేరుకుని చూసేలోపు వ్యక్తి రోడ్డుపై పడిపోయి రక్తపుగాయాలతో ఉన్నాడు. స్థానికులు అతడ్ని హుటాహుటిన అసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పోందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడ్ని మురళిగా గుర్తించారు. ఆయన అటో డ్రైవర్ అని తెలుసుకున్నారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు అసలేం జరిగిందీ అన్న దర్యాప్తులో భాగంగా స్థానిక దుకాణాల్లో ఉన్న సిసిటీవీ ఫూటేజీలను స్వాధీనం చేసుకని పరిశీలించారు. మురళి అనే అటోడ్రైవర్ ఒక దుకాణంలోంచి బయటకు వెళ్లాడు. తన వాహనం వద్దకు వెళ్లిన ఆయన తన బండి తాళంచెవులు తీసేందుకు జేబులో చెయిపెట్టాడు. అంతే వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు టైరు అతివేగంగా వచి మురళిని ఢీకొనింది. ఆకస్మాత్తుగా టైరు ఢీకోనడంతో అయన ముందుకు ఎగిరిపడ్డారు. ముఖానికి, తలకు, తీవ్రమైన రక్తపు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పోందుతూ బాధితుడు మృతిచెందాడు.

కాగా ఈ ప్రమాదఘటన సమయంలో మురళికి వెనుకగా నడుచుకుంటూ వచ్చిన మరో వ్యక్తి ఈ ప్రమాదం నుంచి అడుగుదూరంలో తప్పించుకున్నాడు. అయితే ఎవరూ వేగంగా వస్తున్న ట్రక్కు టైరును గుర్తించలేదు. దీంతో మృత్యువు ఎప్పుడు, ఎలా ముంచుకోస్తుందో అంతుచిక్కన ప్రశ్నని.. అందుకు ఈ వీడియోనే ఓక ఉదాహరణ అని వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించనంత మెరుపువేగంతో ట్రక్కు టైరు చూసుకుని వచ్చి బాధితుడ్ని ఢీకోనడంతో బాధితుడు కొంత‌దూరం అప్రయత్నంగా ముందుకెళ్లి పడటంతో తీవ్రగాయాలపాలయ్యాడని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను మీరూ చూడండి..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles