Telangana govt notification to 1433 posts నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,433 పోస్టుల భర్తీ ఆర్థికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌

Telangana finance department gives clearance to 1433 posts

Municipal Administration Department, Panchayati Raj Departments, Assistant Executive Engineer, Assistant Engineer, Health Assistants, Sanitary Inspectors, Town Planning Building Overseer, Accountant, Junior Assistant, ASO, Finance Department, Telangana, Sarkari jobs, government jobs

The Telangana government has given the green signal to fill the vacancies in the Municipal and Panchayati Raj Departments. Other posts including 657 AEE, 113 AE will be replaced. Permission has been granted for the replacement of Health Assistants, Sanitary Inspectors, Town Planning Building Overseer, Accountant, Junior Assistant, ASO and other posts.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,433 పోస్టుల భర్తీ ఆర్థికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌

Posted: 06/07/2022 07:42 PM IST
Telangana finance department gives clearance to 1433 posts

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్‌లకు చెందిన 1,433 పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసింది. 657 ఏఈఈ, 113 ఏఈ సహా ఇతర పోస్టులు భర్తీ చేయనున్నారు. హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్‌వో ఇతర పోస్టుల భర్తీకీ అనుమతి ఇచ్చారు.

ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ 80వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టులతో పాటు పోలీస్​, రవాణా, అటవీ, ఎక్సైజ్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1, పోలీస్‌ నియామకాల దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో 1,433 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేయనుండగా.. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles