GST collections slip below Rs 1.5-trn mark in May రికార్డు గరిష్టం నుంచి జారిన మే నెల జీఎస్టీ వసూళ్లు.... ఎంతంటే..

Gst collections slip below rs 1 5 trn mark in may despite 44 yoy increase

GST, GST collection, GST collection in May, GST news, GST collections in May, GST tax, GST details check, GST collection April 2022, GST collection May 2022, GST login.in

Goods and services tax (GST) collections slipped below the Rs 1.5 trillion mark in May. India saw gross GST collections of Rs 1.41 trillion during the month. However, the collections in May are 44 per cent higher than the same month in 2021. In April, GST collections had touched a record high of Rs 1.68 trillion, surpassing the Rs 1.5-trillion mark for the first time.

రికార్డు గరిస్టానికి చేరిన మే నెల జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..

Posted: 06/01/2022 08:43 PM IST
Gst collections slip below rs 1 5 trn mark in may despite 44 yoy increase

దేశ ప్రజలపై ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రప్రభుత్వం భారీగా ఆదాయం పోందుతుంది. జీఎస్టీ ఆదాయం మే నెలలో రికార్డు స్థాయి గరిష్టాం నుంచి కిందకి జారింది. ఇక దీంతో ఇకపై ప్రతీ నెల నమోదయ్యే అదనపు జీఎస్టీ ఏ నెలకా నెల రికార్డు స్థాయి గరిష్టాన్ని అందుకోనుందని భావించగా, ఈ రికార్డు గరిష్టం నుంచి ఈ నెలలోనే కిందకు జారింది. ఇంతకీ మే 2022లో జీఎస్టీ కింద వసూలయిన మొత్తం ఎంతో తెలుసా.? వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)గా ఈ నెలలో వసూలైన మొత్తం రూ. 1.41 లక్షల కోట్లు. 2021 మే నెలతో పోల్చితే ఇది 44 శాతం ఎక్కువని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలతో పోలిస్తే మాత్రం ఈ జీఎస్టీ వసూళ్ల కాస్త తక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలలో రూ. 1.41 లక్షల కోట్లుండగా, ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూ. 1.68 లక్షల కోట్ల మేర వసూలైంది. అది రికార్డుస్థాయి గరిష్ఠం కావడం విశేషం. దీంతో గత నెలతో పోల్చితే ఏకంగా 27 వేల కోట్ల రూపాయల జీఎస్టీ మే నెలలో తక్కువగా వసూళ్లైంది. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ రూ. 1.33 లక్షల కోట్లు నమోదైంది. ‘స్థూల జీఎస్టీ రెవెన్యూ మే 2022లో రూ. 1,40,885 కోట్లుగా ఉంది. ఇందులో సీజీఎస్టీ రూ. 25,036 కోట్ల మేర, ఎస్జీఎస్టీ రూ. 32,001 కోట్ల మేర, ఐజీఎస్టీ రూ. 73,345 కోట్ల మేర ఉంది. ఇక సెస్ రూపంలో రూ. 10,502 కోట్లు వసూలైంది..’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

2021 మే నెలలో రూ. 97,821 కోట్లు వసూలైందని, దీనితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 44 శాతం అధికంగా పన్నులు వసూలయ్యాయని తెలిపింది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ. 1.40 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగో సారి. మార్చి నుంచి ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2022 మే నెలలో కూడా స్థూల జీఎస్టీ రాబడులు రూ.1.40 లక్షల కోట్ల మార్కును అధిగమించడం ప్రోత్సాహకరంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2022 నెలలో జనరేట్ అయిన మొత్తం ఇ-వే బిల్లుల సంఖ్య 7.4 కోట్లు. ఇది మార్చి 2022 నెలలో జనరేట్ చేసిన 7.7 కోట్ల ఇ-వే బిల్లుల కంటే 4 శాతం తక్కువ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles