Safeguarding environment equally important: SC రుషికొండ నిర్మాణాలు ఏసీ సర్కారుకు సుప్రీంకోర్టు తాజా అదేశాలు

Supreme court says yes to rushikonda constructions transfers case to ap high court

High Court notices to AP Govt, NGT notices to AP Govt, Supreme Court orders to AP Govt, Rushikonda hills constructions supreme court, Andhra Pradesh Government, Visakhapatnam rishikonda hill constructions, High Court, NGT, Supreme Court, Rushikonda hills, Visakhapatnam, Andhra Pradesh, Politics

Holding that orders of High Court would prevail over Tribunal's in case of contradicting orders passed by High Court and NGT, the Supreme Court on Wednesday quashed the proceedings before National Green Tribunal which halted the construction works at Rushikonda Hills in Visakhapattanam.

అభివృద్ది అసరమే కానీ.. పర్యావరణ పరిరక్షణ కూడా అవసరం: సుప్రీంకోర్టు

Posted: 06/01/2022 07:54 PM IST
Supreme court says yes to rushikonda constructions transfers case to ap high court

రుషికొండలో నిర్మాణాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రుషికొండపై కొత్తగా ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పాత రిసార్టు ఉన్న ప్రదేశంలో మాత్రం కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపింది. హైకోర్టులో తేలేంతవరకు ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీలో తొలుత ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తవ్వకాలను నిలిపివేస్తూ మే 6న ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్ గవాయ్‌ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. హైకోర్టులో తేలే వరకూ ఎన్జీటీలో విచారణ జరపరాదని సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని తెలిపింది.

హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశిస్తూ గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి అవకాశం ఇచ్చింది. రుషికొండ వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ గతేడాదే స్పందించింది. అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటుకూ ఆదేశించింది.

ఈ క్రమంలో రుషికొండను పూర్తిగా తొలచి వేస్తున్న దృశ్యాలు ఇటీవలి కాలంలో విసృత్తంగా ప్రచారం అయ్యాయి. వీటి ఆధారంగా రుషికొండ ప్రాంతంలో ప‌ర్యావ‌ర‌ణ ఉల్లంఘన జ‌రుగుతోంద‌ని నర్సాపురం ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. తవ్వకాల్లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నార‌ని పేర్కొన్నారు. వీటిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్జీటీ..స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తవ్వకాల అంశంపై హైకోర్టులోనూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా విచారణ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  NGT  Supreme Court  Rushikonda hills  Visakhapatnam  Andhra Pradesh  Politics  

Other Articles