14-Yr-Old Odisha Boy Survives A Crocodile Attack మొసలితో పోరాడి గెలిచిన 14 ఏళ్ల సాహో..

Close shave for minor boy after being dragged by crocodile in kendrapara

Close Shave For Minor Boy, crocodile In Kendrapara, Dragged By Croc, Dragged By crocodile, crocodile attack, hitarkanika National Park, Kendrapara, Pattamundai, 14 yrs Boy, Om Prakash Sahoo, Kani river, Araji village, Pattamundai police station, Boy survives crocodile attack, SCB medical hospital, Cuttack, odisha, crime

A 14-year-old boy from a riverside village in Odisha's Kendrapara district displayed exemplary courage to survive from crocodile attack after a ten-minute confrontation with the reptile, police said. The boy Om Prakash Sahoo was taking a bath with his friends in Kani river near Araji village under Pattamundai police station jurisdiction when the 7 feet long crocodile emerged from nowhere to drag him. But he fought bravely with the reptile to save his life.

మొసలితో పోరాడి గెలిచిన 14 ఏళ్ల సాహో.. కటక్ అసుపత్రిలో చికిత్స..

Posted: 05/31/2022 01:10 PM IST
Close shave for minor boy after being dragged by crocodile in kendrapara

స్థానబలం అన్న పదం విన్నరా.. అలాంటిది తన అడ్డాలోకి వచ్చిన వారిని వదలదు మొసలి. మొసలి స్థానబలం నీరు అన్న విషయం తెలిసిందే. నీటిలో ఉండగా దాని పట్టు ముందు గజరాజు కూడా వెనకబడాల్సిందే అని గజేంద్రమోక్షం కథ కూడా చెబుతోంది. మకరానికి చిక్కిన గజరాజు తనను రక్షించాలని శ్రీమహావిష్ణువును వేడినే వెంటనే ఆయన ఉన్నఫలంగా వైకుంఠ వదిలి సరోవరానికి చేరి మొసలి తలను సుదర్శన చక్రంతో ఖండించి రక్షించిన కథ తెలిసిందే. ఇక ఇటీవల ఒక చిరుత నీటిని తాగేందుకు ఓ నది ఒడ్డుకు చేరిగానే అదను చూసి దానిని నోటకరుచుకుపోయిన విషయం కూడా తెలిసిందే.

అలాంటి మొసలిని దానికి అత్యంత బలమున్న నీటిలోనే ఓడించి ఒడ్డుకు చేరిన 14 ఏళ్ల మైనర్ బాలుడి గురించి తెలుసా.? ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం ఉత్త చేతులతోనే దానిని మట్టికరిపించి.. ఈ బాలయోధుడు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఔనా.. ఇదంతా నిజమా.. అన్న సందేహాటు వస్తున్నాయా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం.. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపరా జిల్లా నేషనల్‌ పార్క్‌ పరిధిలో భితర్‌కనికా నది ఉంది. అరజా గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు రోజుమాదిరిగానే సరదాగా ఆ నది ఒడ్డుకు ఈతకు వెళ్లారు.

అందులో పద్నాలుగేళ్ల ఓంప్రకాశ్‌ సాహోను.. ఉన్నట్లుండి ఏడడుగుల పొడవు ఉన్న ఓ మొసలి నీళ్లలోకి లాక్కెల్లింది. నడుము లోతు నీటిలోకి మునిగిపోయిన కుర్రాడు.. ప్రాణ భయంతో కేకలు వేశాడు. వెంటనే మిగతా పిల్లలు ఒడ్డుకు చేరి సాయం కోసం స్థానికులను పిలిచారు. అయితే అప్పటికే మొసలి నోట్లో సాహో చిక్కుకుపోయాడు. ఈలోపు ఒడ్డున్న ఉన్న కొందరు మొసలిపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా శక్తిని కూడదెచ్చుకుని మొసలి కళ్లలో తన వేళ్లతో పొడిచి.. దాని తలపై పిడిగుద్దులు గుద్దాడు సాహో. ఆ దెబ్బకి విలవిలలాడుతూ.. అతన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయింది మొసలి.

ఒడ్డుకు ఎలాగోలా చేరిన కుర్రాడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాళ్లు చేతులకు గాయాలు కావడంతో కటక్‌ ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. సాహసంతో మొసలితో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ కుర్రాడిని అంతా మెచ్చుకుంటున్నారు. ఇదిలాఉంటే నెల వ్యవధిలో  భితర్‌కనికా నదిలో ఒడిషాలో మొసళ్ల బారిన పడి ముగ్గరు చనిపోయారని, ప్రస్తుతం మకరాలు గుడ్లుపెట్టే సమయం కావడంతో.. అవి నీరు ఉద్దృతి అధికంగా లేని ప్రాంతాలకు చేరి అక్కడ అనువైన ప్రదేశాల్లో గుడ్లను పెడాతాయని వన్యప్రాణ అధికారులు తెలిపారు.

ఈ తరుణంలో నదీ పరివాహిక ప్రాంతాల ప్రజలను ఇప్పటికే నదులకు వెళ్లే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశామని, దానిని మరింత విసృత పరుస్తామని చెప్పారు. మే నెల చివరితో మొదలుకుని శీతాకాలం వరకు మకరాలు పిల్లల్ని పెట్టే సమయమని అధికారులు తెలిపారు. ఈ సమయంలో మనుషులకు- మకరాలకు మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సహజమని, అందుకనే అప్రమతత్త అవసరమని అధికారులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles