IRCTC returns refund of Rs 35 to 2.98L users రూ. 35 కోసం ఐదేళ్ల పోరాటంలో విజయం..

Kota engineer gets rs 35 refund after 5 year fight helps 3 lakh other irctc users

Indian Railways, rail ticket refund, IRCTC, Kota, railways, rail ticket, train tickets, trains, Kota rail, ticket refund,Indian Railways, rail ticket refund, IRCTC, Kota, IRCTC, IRCTC train ticket cancellation, IRCTC train ticket, Anurag Thakur, Indian Railways, RTI, GST

A Kota-based man has won his five-year fight to get a Rs 35 refund from the Railways, helping in the process nearly 3 lakh people who were in a similar situation. The Railways has approved Rs 2.43 crore in refunds to 2.98 lakh IRCTC users, said Kota-based engineer Sujeet Swami quoting an RTI reply received by him.

రూ. 35 కోసం ఐదేళ్ల పోరాటంలో విజయం.. రైల్వేకు 2.43 కోట్ల శఠగోపం

Posted: 05/31/2022 12:22 PM IST
Kota engineer gets rs 35 refund after 5 year fight helps 3 lakh other irctc users

ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలియదు అన్న నానుడి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ఎవరూ సామాన్యంగా పెట్టుకోరు. ఎందుకంటే ఓ పట్టాణ ఈ ప్రభుత్వ సంస్థలు విషయాన్ని వదిలిపెట్టవని, దీంతో తమ అమూల్యమైన సమయం కాస్తా వృధ్దా అవుతుందని వారు భావిస్తుంటారు. కానీ కొందరు మాత్రం తెగినా పర్వాలేదు.. లాగి చూద్దాం.. ఎదుటి వారు బలవందులయితేనే తమ బలం కూడా తెలుస్తుందని సవాల్ కు సిద్దంగా ఉంటారు. ఇలాంటి వారి జాబితాలోనే రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్‌స్వామి అనే ఇంజినీర్ కూడా స్థానం దక్కించుకున్నారు. ఔనా.. ఈ ఇంజనీరు ఎలాంటి పోరు చేశారన్న పూర్తి వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

రైల్వే శాఖ నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను వెనక్కి రప్పించుకోవడంతో పాటు ఏకంగా తనలా కొన్ని లక్షల మందికి కూడా వారి అమూల్యమైన డబ్బును వారికి తిరిగి ఇప్పించడానికి కారణబూతుడయ్యాడు. ఏంటీ రూ.35 కోసం పోరాటమా.? ఈ చిన్న మొత్తం కోసం ఎవరైనా పోరాటం చేస్తారా.? అంటే అతని ఒక్కడి నుంచి రూ. 35 కాదు.. ఏకంగా 2.98 లక్షల మందికి రూ.35 తిరిగి వెనక్కు ఇప్పించాడు. అంటే దాదాపుగా 2.43 కోట్ల రూపాయలను రైలు ప్రయాణికులకు తిరిగి ఇప్పించడానికి అతను చేసిన పోరాటమే కారణమైందంటే నమ్మశక్యంగా లేదా.? ఇప్పుడ చెప్పండీ అయన చేసిన పోరాటం రూ. 35 కోసమేనా.. లేక రూ.2.43 కోట్ల కోసమా.? ఇక పోరాట వివరాల్లోకి వెళ్తే..

రైల్వేతో ఐదేళ్లు పోరాడి తనకు రావాల్సిన రూ. 35 సాధించుకున్నారు. అంతేకాదు, ఆయన పోరాటంతో 2.98 లక్షల మందికి లబ్ధి చేకూరడం గమనార్హం. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్‌స్వామి ఇంజినీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2 జులై 2017న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా ఏప్రిల్‌‌లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ ధర రూ. 765 చెల్లించారు. ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో రూ. 100 మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ రిఫండ్ చేసింది. నిజానికి కేన్సిలేషన్ రుసుము రూ. 65 మాత్రమే మినహాయించుకోవాల్సి ఉండగా అదనంగా రూ. 35 జీఎస్టీ కింద వసూలు చేయడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే అవి జీఎస్టీ చార్జీల కింద మినహాయించుకున్నట్లుగా అధికారులు నుంచి వచ్చిన వివరణతో తాను సంతృప్తి చెందలేదు. తాను జీఎస్టీ అమల్లోకి రాకముందే టికెట్ బుక్ చేసుకున్నానని, అలాంటప్పుడు తన నుంచి జీఎస్టీ ఎలా వసూలు చేస్తారని రైల్వేపై పోరాటానికి దిగారు. ఇందులో భాగంగా రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద 50 అర్జీలు పెట్టారు. అయితే ఆయన పోరాటంలో న్యాయముందని గ్రహించిన రైల్వేశాఖ దిగొచ్చించి. జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ. 35ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.

రూ. 35 చెల్లించాల్సిన రైల్వే 1 మే 2019న ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు. ఆ రెండు రూపాయలను కూడా రైల్వే ఆయన ఖాతాలో జమచేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 2.98 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని కేన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ. 2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IRCTC  IRCTC train ticket cancellation  IRCTC train ticket  Anurag Thakur  Indian Railways  RTI  GST  

Other Articles