Monsoon Arrives In Kerala, 3 Days Ahead Of Schedule వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు.!

Southwest monsoon reaches kerala 3 days early likely to hit telugu states around june 5

Weather update, Monsoon, Monsoon News, Delhi Weather, Weather News, Kerala Rains, Delhi Temperature, Delhi Weather news, Weather news, Monsoon in India, India monsoon update, Rain forecast, India Meteorological Department ,Weather Update, Monsoon, monsoon news, Delhi Weather, weather news

The southwest monsoon has set in over Kerala against the normal date of onset that is June 1, said the India Meteorological Department (IMD). The weather office added the southwest monsoon has thus set in over Kerala three days ahead of its normal date.

చల్లని కబరు వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు.!

Posted: 05/30/2022 12:41 PM IST
Southwest monsoon reaches kerala 3 days early likely to hit telugu states around june 5

గ్రీష్మతాపంతో విలవిలలాడిన దేశప్రజలకు చల్లటి కబురు అందింది. ప్రకృతి సొంతరాష్ట్రంగా అభివర్ణించబడే కేరళకు చల్లటి కబరు తాకిందని, ఇక మరోవారం రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాలను కూడా ఈ సమాచారంలో తడిసి ముద్దవుతాయని చెప్పింది. అంటే ముందుగా ఊహించినట్టుగానే బంగాళాఖతం మీదుగా అండమాన్ ను ద్వీసాలను తాకుతూ వచ్చిన నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాయి. ఇక మరో వారం రోజుల వ్యవధిలో ఈ రుతుపవనాలు తెలుగురాష్ట్రాలను కూడా పలకరించనున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఎండలతో అల్లాడిపోతున్న జనానికి ఇది చల్లటి కబురే.

వాతావరణశాఖ వేసిన అంచనాలను నిజం చేస్తూ ఈ ఏడాది రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈసారి మే 29నే కేరళను తాకాడం గమనార్హం. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌లోని మిగిలిన ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇవి విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

అలాగే, మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా రుతుపవనాలు తాకుతాయన్నారు. నిజానికి ఈ నెల 27వ తేదీనే రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేసినప్పటికీ అరేబియా సముద్రంలో పడమర గాలులు అనుకూలంగా లేకపోవడంతో వాటి రాక ఆలస్యమైంది. అరేబియా సముద్రం నుంచి పడమర దిశగా గాలులు 25 నుంచి 35 కి.మీ. వేగంతో కేరళపైకి వీస్తుండడంతో రుతుపవనాల రాకను వాతావరణ శాఖ నిర్ధారించింది. వాతావరణం అనుకూలిస్తే జూన్ తొలి వారంలో ఏపీలోని రాయలసీమను తొలుత రుతుపవనాలు తాకుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, ఈ ఏడాది నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles