WHO fears possible community spread of monkeypox కలవరం: అటు మంకీ పాక్స్.. ఇటు కాంగో ఫీవర్

Monkeypox spreads to 23 countries deadly nose bleed congo fever shocks iraq as cases surge

covid,coronavirus,virus,nose-bleed fever,nose-bleed,fever,Iraq,CCHF,Crimean-Congo haemorrhagic fever, Monkeypox, Monkeypox Virus, Monkeypox disease, WHO, Monkeypox Virus cases increase, Monkeypox disease details, monkeypox virus outbreak, what is monkeypox, monkeypox symptoms, monkey pox symptoms, monkey pox in india, Monkeypox virus disease outbreak,Monkeypox, Monkeypox Virus, Monkeypox disease, WHO, World Health Organization

Spraying a cow with pesticides, health workers target blood-sucking ticks at the heart of Iraq's worst detected outbreak of a fever that causes people to bleed to death. This year Iraq has recorded 19 deaths among 111 CCHF cases in humans, according to the Word Health Organization.

ఇరాక్ ను వణికిస్తున్న కాంగో ఫీవర్.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్..

Posted: 05/30/2022 11:43 AM IST
Monkeypox spreads to 23 countries deadly nose bleed congo fever shocks iraq as cases surge

కరోనా మహమ్మారి ముగిసిందని భావించినా ఇప్పటికీ పలు దేశాల్లో ఇంకా తన ప్రభావం చాటుతూనే వుంది. ఈ క్రమంలో ఊపిరి పీల్చకుంటున్న ప్రజలపై జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు సోకుతున్నాయి. దీంతో యావత్ ప్రపంచం మరోమారు కలవరపాటుకు గురవుతోంది. ఓ వైపు మంకీ పాక్స్ ప్రపంచదేశాలకు విజృంభిస్తుండగా, అదే సమయంలో ఇటు కాంగో ఫీవర్ కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. ప్రాణాంతక కాంగో ఫీవర్‌తో ఇరాక్ ను వణుకిస్తోంది. దేశంలో ఇటీవల ఈ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ప్రాణాంతక జ్వరం బారిన పడి ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మంది మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) తెలిపింది. జంతువుల నుంచి మానవులకు వ్యాపించిన ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మరీ ముఖ్యంగా ఆవులు, గోదలపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. తల నుంచి పాదాల వరకు పీపీఈ కిట్లు ధరించడంతోనే దాని నుంచి తప్పించుకోవచ్చునన్న వార్తలు రావడంతో.. ఇరాక్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినీ పిపిఈ కిట్లు ధరించే ప్రజలు తిరుగుతున్నారు.

నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇరాక్‌లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.

ఇక మరోవైపు యావత్ ప్రపంచాన్ని మంకీపాక్స్ వణికిస్తోంది. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వ్యాది కారణంగా ప్రజారోగ్యానికి ముప్పుపొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఇదే కలవరపాటుకు గురిచేస్తోందని డబ్యూహెచ్ఓ పేర్కోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో 257 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది.

వైరస్ సమూహ వ్యాప్తి ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ముప్పు పొంచిఉన్నదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. త్వరలోనే భారీసంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది. మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles