School Principal Beaten By Wife, Court Orders Security ప్రధానోపాధ్యాయుడికి భార్య నుంచి రక్షణ కల్పించిన కోర్టు

On cctv school principal beaten by wife court orders security after plea

Ajit Yadav, principal, Kharkara government school, Suman Yadav, cricket bat, iron pan,other weapons, police protection, investigate allegation, Husband assault, Sonipat, CCTV cameras, love marriage, Domestic violence, Bhiwadi domestic violence, Rajasthan domestic violence, evidence, Haryana, crime

A government school principal in Rajasthan, who accused his wife of domestic violence, has been given security after he approached a local court with videos that are in wide circulation online. In the video, Ajit Yadav, the principal at the Kharkara government school in Haryana, is chased around and beaten by a woman who is believed to be his wife. The woman hits him with a cricket bat, iron pan and other "weapons" in the house.

ITEMVIDEOS: ప్రధానోపాధ్యాయుడి పాట్లు: భార్య దండయాత్ర.. భర్తకు రక్షణ కల్పించిన కోర్టు..

Posted: 05/26/2022 07:59 PM IST
On cctv school principal beaten by wife court orders security after plea

తన కుటుంబం సమాజంలో ఉన్నతంగా ఉండాలని కోరుకునే భార్యభర్తలు ఇద్దరు రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి పనిచేసుకుని బిడ్డలకు చక్కని విద్యను అందిస్తారు. అయితే కొన్న కుటుంబాలలో మాత్రం భార్యలు అనుక్షణం గృహహింసను ఎదుర్కోంటూనే ఉంటారు. భర్తల నుంచే కాదు.. అత్త మామలు, ఆడపడచుల చిత్ర​ హింసలు కూడా ఎంతో మంది వివాహితలు బలవుతున్నారు. అనేకానేకులు ఇప్పటికీ మౌనంగా భరిస్తూనే ఉన్నారు. అయితే కేవలం మహిళలే ఇలాంటి వేధింపులను అనుభవించడం లేదండీ.. భర్తలు కూడా ఇలాంటి చిత్కారాలు, అవమానాలు, వేధింపుల, దాడులను అనుభవిస్తున్నారు.

ఇక బాధిత భార్యలు న్యాయస్థానాలను ఆశ్రయించి తాడో పేడో తేల్చుకుంటున్నారు. కానీ భర్తలు మాత్రం మింగలేక, కక్కలేక తమలో తామే మౌనంగా బాధను అనుభవిస్తున్నారు. ఇక ఒకరికి ఒకరు తోడై భార్య బాధితుల సంఘం అని కూడా ఏర్పాటు చేశారు. అయితే అది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. కానీ రాజస్థాన్ లో రోజు తన భార్య చేతిలో తన్నులు తినే భర్తను చూశారా.? అజిత్‌సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన భార్య చేతిలో నిత్యం వేధింపులకు గురవుతున్నాడు. అయితే ఈయనేదో పనిపాట లేక.. జులాయిగా తిరుగే వ్యక్తి అంతకన్నా కాదండి. ఓ పాఠశాల ప్రదానోపాధ్యయుడు. అందుకనే గత కొన్నేళ్లుగా బాధను తనలో తానే అనుభవిస్తున్నా ఎవరికీ చెప్పలేకపోయాడు.

కానీ గత ఏడాది కాలంగా తన భార్య వేధింపులు ప్రతీరోజు ఉదయం సాయంత్రాలు రోటిన్ గా మారడంతో తట్టుకోలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. హర్యానాకు చెందిన సుమన్‌ యాదవ్ ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అజిత్ సింగ్ యాదవ్. ఈ జంట అల్వార్‌ జిల్లాలో నివాసముంటున్నారు. మొదట్లో వీరి సంసార జీవితం ప్రశాంతంగానే సాగింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే వాటినే అదునుగా చేసుకుని ఆయన భార్య సుమన్ అతడ్ని తిట్టింది. దుర్భాషలాడింది. అవి కాస్తా శృతిమించి చేయిచేసుకోవడం వరకు వెళ్లాయి. తన భార్యే కదా.. అప్పుడప్పుడు అవుతంటాయని మిన్నకుండిపోయాడు.

ఇక ఆయన మంచితనాన్ని అసరాగా చేసుకున్న అమె ఆయనపై చేయి చేసుకోవడం.. అనేకసార్లు భర్తను ఇష్టంవచ్చినట్లు కొట్టడం చేసింది. చేతికి ఏది దోరికితే అది తీసుకుని భర్తను కొట్టడం అలావాటు చేసుకుంది. క్రికెట్ బ్యాట్, పెనం, లోటా.. ఇలా ఏది దోరికితే అది. అమె నుంచి తప్పించుకునేందుకు ఆయ మరో గదిలోకి కూడా పరుగులు తీసేవాడు. అంతేకాదు అమె కొడుతుంటూ దిండ్లు అడ్డుపెట్టుకునేవాడు. ఇలా సుమన్ యాదవ్ చేతిలో దెబ్బలు తీన్న ఇయన గాయాలపాలైన అజిత్‌ సింగ్‌ ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స కూడా పొందాడు. అయితే భార్య హింసతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు.

తన భార్య మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలంటూ కోర్టును కోరాడు. చేతికి ఏది దొరికితే అది క్రికెట్‌ బ్యాట్‌, పాన్‌, కర్రలతో దాడి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో భార్య భర్తను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే తల్లి దెబ్బలకు బెదిరిపోయిన కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతుండటం కూడా చూడవచ్చు. ఈ కేసును విచారించిన కోర్టు ఆయన అరోపణలపై దర్యాప్తు చేసి.. బాధితుడికి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles