ధైర్యే సాహసే లక్ష్మీ అంటారు.. కానీ కొన్ని సాహసాలు చేసేప్పుడు మాత్రం తప్పక అందుకు తగ్గ తర్ఫీదు అవసరం. లేకపోతే ఎంతటి ప్రమాదమో సంభవిస్తుందో చెప్పే అవకాశమే ఉండదు. అందుకనే ఏదైనా ఫీటు చేసేప్పుడు కచ్చితంగా నిపుణుల పర్యవేక్షణ అవసరం. అయితే ఇది వారి ఏ క్షణంలోనైనా పట్టుతప్పితే.. ఏమి జరగకుండా ఉండేందుకు దోహదపడేలా చేస్తోంది. కానీ ఉడుకు రక్తం ఉరుకలేస్తున్న క్రమంలో దేనిని లెక్కచేయక ఓ యువకుడు చేసిన సాహసం.. బాగానే సాగింది. అయితే దాదాపుగా మూడింట రెండొంతుల సాహసం చేసిన తరువాత ఫీటు చేజారింది.
అంతే ఎంతో పైనుంచి ఒక్కసారిగా కిందకు జారిపోయాడు. అంతటి కష్టతరమైన ఈ ఫీటు సరదాకు చేసిన యువకుడిని ఆసుపత్రిపాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చింది. డ్యామ్ అధికారులు వద్దని వారించినా పట్టించుకోకుండా అరుదైన ఫీటు చేయబోయిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల కర్నాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్ నీళ్లు కిందకు వస్తున్నాయి. వేసవిలో దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ యువకుడు(20) పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాకు ట్రెక్కింగ్ చేయబోయాడు. అతడు దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. కాగా, ఆనకట్ట దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడి ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
WATCH - A youth fell to the ground from a height of around 30-feet while trying to scale the wall of Srinivasa Sagara Dam in Chikkaballapur district of Karnataka. #SrinivasaSagaraDam #Karnataka #viralindo pic.twitter.com/oUU1uZanjY
— Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) May 23, 2022
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more