Wedding called off after Unnao bride learns of groom's baldness సృహతప్పిన వరుడు.. నిజం తెలిసి ఆగిన వివాహం

Up bride refuses to marry bald groom after his wig comes off during wedding

bald groom, bride videos, bride online videos, bride rejects groom, bride calls off wedding, bald groom rejected, up bride, up groom, up wedding, up wedding scene, bride and bald groom, bride, groom, wedding, bald groom, unnao, kanpur, uttar pradesh, indian wedding, marriage, wig, Unnao, Uttar Pradesh, crime, wedding videos, trending wedding videos, trending bride videos, latest trending news, trending news

A bride in Uttar Pradesh’s Unnao refused to marry the groom after wedding rituals had already gotten under way. Recently, a number of bizarre reasons have been reported for which people have abandoned their weddings. This particular incident occurred in Unnao

వరమాల మార్చుతుండగా సృహతప్పిన వరుడు.. నిలిచిపోయిన వివాహం

Posted: 05/23/2022 07:36 PM IST
Up bride refuses to marry bald groom after his wig comes off during wedding

వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు పెద్దలు. కానీ పెళ్లికొడుకు ఆడిన ఒకే ఒక అబద్ధం ఆ వివాహాన్నే ప్రశ్నార్థకం చేసింది. పెళ్లికి రెడీ అయిన వరుడు.. సరిగ్గా పెళ్లి జరుగుతున్న క్రమంలో వరమాల మార్చుకుంటున్నతరుణంలో సోమ్మసిల్లి  పడిపోయాడు. అక్కడే వచ్చిందీ అసలు చిక్కు. నీళ్లు చల్లడిన తరువాత వరుడి ముఖం తుడిచేందుకు అతని భుజాన వేసుకున్న టవల్ లాగితే.. ఏకంగా వరుడి గుట్టు బయటపడింది. వామ్మో ఇతను వరుడు కాదు.. ఇతడ్ని నేను పెళ్లి చేసుకోను.. అని తెగేసి చెప్పింది వధువు. ఇక వధువు తరపు బంధువులు కూడా జతకలసి మోసం చేసిన పెళ్లి చేద్దామనుకున్నారా.? అని ప్రశ్నించారు.

పెళ్లంటే నూరేళ్ల పంట.. అంటూ రెండు మనసులు కలవాలని, ఇద్దరు మనుషుల కలయిక అని ఇలా ఎన్నో చెబుతారు పెద్దలు. అయితే ఇప్పటి తరం అమ్మాయిలు మాత్రం మా టెస్టుకు సరిపోయినట్టు అయితేనే పెళ్లికి రెడీ. లేదంటే అసవరమే లేదని తేల్చిచెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగిందీ కూడా అదే. వరుడు అందంగా ఉన్నాడు. కానీ అది ఫోటోలో. నిజానికి మాత్రం వరుడు అందంగానే ఉన్నా.. దానికి తోడు ఆయనకు ఓ లోపం కూడా ఉంది. సొమ్మసిల్లి పడిపోయిన వరుడి ముఖంపై నీళ్లు చల్లి.. అతని భుజాన ఉన్న టవల్ తో ముఖం తుడిచే క్రమంలో తెలిసిందీ నిజం.

ఆ నిజం వధువుకు మింగుడు పడలేదు. నిజం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మోసం చేయడం అమె సహించలేకపోయింది. పెళ్లికి ముందే ఇంతలా మోసం చేస్తే పెళ్లైన తరువాత ఇంకెంతగా మోసం చేస్తారో.. అని అవేదన చెందింది. వరుడి కుటుంబం. బంధువులు అంతా కలసి ఇలా మోసం చేయడం అమె ఏమాత్రం జీర్ణంచుకోలేకపోయింది. అసలేం జరిగిందీ.? వరుడికి సంబంధించిన ఏ నిజం తెలిసిందీ అంటే.. టవల్ లాగే క్రమంలో వరుడి తలపై వున్న విగ్గు కూడా ఊడింది. దీంతో వివాహమే రద్దు అయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ ఉన్నావ్‌లో జరిగింది. వరుడికి జుట్టు లేదన్న నిజాన్ని తెలుసుకున్న వధువు పెళ్లికి నిరాకరించింది. దీంతో వరుడి పెళ్లి కల చెదిరిపోయింది.

జయమాల వేడుక అనంతరం ఉన్నట్టుండి పెళ్లికొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. అతడ్ని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు మొహంపై నీళ్లు చల్లాడు. తలపాగా తీసే క్రమంలో వరుడు విగ్గు ఊడిపోయింది. దీంతో పెళ్లి కూతురు బంధువులు షాకయ్యారు. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. మోసం చేసి పెళ్లి చేయాలని చూశారని పెళ్లి కూతురు బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన వారు ఇరు కుటుంబాలను శాంతింపజేెశారు. అయితే అధికారికంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒక వేళ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride  groom  wedding  bald groom  unnao  kanpur  uttar pradesh  indian wedding  marriage  wig  Unnao  Uttar Pradesh  crime  

Other Articles

Today on Telugu Wishesh