పిల్లలు తమ స్నేహితుల ముందు హీరోలు అనిపించుకోవాలని విలన్ పనులు చేస్తుంటారు. అయితే అలాంటి పనులు చేయడంతో తన స్నేహితుల ముందు హీరో అటుంచితే.. తన రాష్ట్రమే కాదు యావత్ దేశం ఎదుట దోషిదా నిల్చున్నాడు. ఈ యువకుడి విషయంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులకు వీడియోను రీట్విట్ చేసి.. చర్యలకు ఉపక్రమించాల్సిందిగా అదేశించడంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాల వెనక్కి నెట్టివేయబడ్డాడు. తాను చేస్తున్న పని ఏంటీ అన్న విఛక్షణ కోల్పోయిన బాలుడు.. స్నేహితుల గర్వంగా చెప్పుకునేలా చేయాలని ఏకంగా పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఏకంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దృష్టికి చేరింది. దీంతో ఆయన ఈ వీడియోపై తక్షణం యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు ఆ వీడియోను ఆదివారం రీట్విట్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరిద్దరి మధ్య ఈ వివాదానికి కారణం ప్రేమ వ్యవహారమేనని స్థానిక దుమ్కా డీఎస్పీ నూర్ ముస్తాఫా అన్సారీ తెలిపారు. ఈ సంరద్భంగా ముఖ్యమంత్రి ఇవాళ మళ్లీ తన ట్విట్టర్ ద్వారా అప్ డేట్ అందించారు. బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
అయితే బాలుడు స్థానికంగా 9వ తరగతి చదువుతున్నాడని, వీరిద్దరూ గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారేనని, అయితే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నేపథ్యలో వివాదం తల్లెత్తిందని తెలిపారు. బాలుడ్ని జువైనల్ హోంకు తరలించనున్నామని తెలిపారు. కాగా పాకుర్ జిల్లా ఎస్సీ హర్ధీప్ జనార్థన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అన్నారు, వివరాల్లోకి వెళ్తే.. ఓ బాలుడు తన ప్రేయసిపై దారుణానికి పాల్పడ్డాడు. పంట పొలాల్లోకి తీసుకెళ్లి ఆ బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. ఆ విద్యార్థినిని తన కాళ్లతో ఘోరంగా తంతూ పరుగెత్తించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో వెలుగు చూసింది.
దుమ్కా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని.. 16 ఏండ్ల యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. ఆ బాలికను యువకుడు పంట పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లతో తంతూ పరుగెత్తించాడు. బాధితురాలు కింద పడిపోయినా కనికరం చూపకుండా.. ఆమెపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనను యువకుడి స్నేహితులు రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఈ ఘటన 15 రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
.@pakurpolice कृपया उक्त मामले की जांच कर आरोपियों पर कार्यवाई करते हुए सूचित करें।@dcpakur @JharkhandPolice https://t.co/UO6W841jqB
— Hemant Soren (@HemantSorenJMM) May 22, 2022
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more