నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు ప్రతీరోజు నదుల్లోనే స్నానం చేస్తుంటారు. నదీ సాన్నాలు ఆచరించడం వారి జీవన విధానంలో భాగమైపోతుంది. క్రమంగా అడవులు తగ్గడం, వర్షాలు కురవకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రవహించాల్సిన నదులు కూడా నానిటికీ కుచించుకుపోతున్నాయి. దీంతో నదీ ప్రవాహాల్లో నీటితో పాటు జీవించే జంతుచరాల సంఖ్య కూడా నానాటికీ తగ్గుముఖం పడుతోంది. దీంతో ఎప్పుడో కానీ కనబడని మకరాలు కూడా ఆ మధ్యకాలంలో మనుషులపై దాడి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లో ఓ నదీ ఒడ్డున్న స్థానిక గ్రామస్థులతో పాటుగా స్నానం చేస్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసిన మొసలి అతడిని నదిలోకి లాక్కెళ్లింది.
రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఈ దిగ్ర్భాంతికర అనూహ్యఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం ఆచరిస్తున్న మరికోందరు గ్రామస్థులు.. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు సంబంధిత అధికారులు రంగంలోకి దిగి.. మొసలి లాక్కెళ్లిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు వ్యక్తి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోటాకు సమీపంలోని ఖటోలి పట్టణంలోని పార్వతి నదిలో స్థానిక రామ్ ఘాట్ వద్ద స్థానికులతో పాటుగా అదే పట్టణానికి చెందిన బిల్లూ అనే 38 ఏళ్ల వ్యక్తి కూడా వచ్చాడు. స్నానం చేసేందుకు అతడు నదిలోనికి దిగాడు.
అయితే ఎప్పటి నుంచో అక్కడే నక్కిన ఒ మొసలి.. అక్కడికి చేరువగా ఎవరు వస్తారా.. అని ఎదురుచూసింది. బిల్లూ నదిలోకి దిగగానే ఒక్కసారిగా అతడిపై దాడిచేసి నోట కరుచుకుని నదిలోకి లాక్కెళ్లిపోయింది. నదిలో స్నానం చేస్తున్న మిగతా వారు భయంతో ఒడ్డుకు చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నది వద్దకు చేరుకుని బిల్లూ కోసం గాలించారు. నదిలో మొసళ్లు ఉండడంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఈ నెల మొదట్లో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొలునులో స్నానం చేస్తున్న బాలుడిపై దాడిచేసిన మొసలి అతడిని చంపేసింది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more