కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి దారుణ ఘటనలు అనేకం జరుగుతున్నా.. ఈ కేసు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పోలీసులు 81 ఏళ్ల వృద్ధుడిపై ‘డిజిటల్ రేప్’ కేసు నమోదు చేశారు. యూపీలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇది రెండోసారి. డిజిటల్ కేసు అంటే ఏంటీ.. మైనర్ బాలికను లైంగికంగా వేదిస్థూ డిజిటల్ గా వీడియోలు తీస్తున్నాడా.? అనేగా మీ సందేహం. అందుకనే పోలీసులు అతనిపై డిజిటల్ రేప్ కేసు నమోదు చేశారనేగా మీ డౌట్.
డిజిటల్ రేప్ అనేవి రెండు వేర్వురు పదాలు.. డిజిట్, రేప్. కానీ రెండింటినీ కలిపి డిజిటల్ రేప్ అని పేరు పెట్టారు. డిజిట్ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఆంగ్ల నిఘంటువులో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. దీంతో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆ సంఖ్యల ఆధారంగా కేసు నమోదు చేస్తారు. డిజిటల్ రేప్ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం లాంటి లైంగిక వైధింపులకు పాల్పడటం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు తెలుసుకుని ఈ కేసును నమోదు చేస్తారు.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. అలహాబాద్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడు మౌరిస్ రౌడర్ నోయిడాలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి ఉంటున్న ఆయన తన పనులకు బదులు.. తన స్నేహితురాలి ఇంట్లో పనిచేసేందుకు పెట్టుకున్న 17 ఏళ్ల మైనర్ బాలికను టార్గెట్ చేశాడు. తన మనవరాలి వయస్సున్న చిన్నారిపై ఏడేళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. చిన్నవయస్సులో అమెకు అవి లైంగిక వేదింపులని తలియకపోవడంతో మిన్నకుండిపోయింది. కానీ పెద్దవుతున్న కోద్దీ వేధింపులు కూడా పెరిగాయి.
దీంతో అతడి వేధింపులు భరించలేని బాధిత బాలిక తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పనిలో చేరినప్పటి నుంచి మౌరిస్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత బాలిక పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో, ఆడియో రికార్డులను సాక్ష్యాలుగా అందజేసింది. నిందితుడిపై ‘డిజిటల్ రేప్’ అభియోగాలు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి తోడు మైనర్ బాలికను పనిలో ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అతడితోపాటు నిందితుడి స్నేహితురాలిపై కూడా కేసు నమోదు చేసే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more