హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీని జరిగిన ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు పిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది. అయితే ఓ వైపు దొంగల కోసం అన్వేషిస్తూ.. మరోవైపు బాధితుడిని కూడా వెతికారు పోలీసులు. ఈలోగా నిందితుల సమాచారం తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించిన నిందితులు.. వారు వెల్లడించిన నేరాల చిట్టా విని అవ్వాకయ్యారు.
బాధితుడి నుంచి 7వేల 900 నగదు, ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త రూ.6000 విలువైన సెల్ ఫోన్ ను దొంగిలించి పారిపోయారు. ఇందుకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీని స్థానికంగా గల హార్డ్ వేర్ దుకాణం నుంచి పోలీసులు సేకరించడంతో వారు చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్లను పోలీసులకు చిక్కేలా చేసింది. నిందితులను గుర్తుపట్టడంతో పాటు వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ఈ సీసీటీవీ దృశ్యాలు పోలీసులకు దోహదపడ్డాయి. బాధితుడిని సురేష్ ముఖియాగా గుర్తించిన పోలీసులు అతను ప్రేమ్ నగర్‌లోని ఓ ఉక్కు వ్యాపారి వద్ద హెల్పర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు.
ఈ నెల 10వ తేదీన ఉదయం 6.’25 నిమిషాలకు తమ గ్రామానికి చెందిన మధ్యవర్తి ద్వారా తమ కుటుంబసభ్యులకు డబ్బు పంపాలని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వద్ద డబ్బులు వున్నాయని పసిగట్టిన ఇద్దరు దుండగులు అతడ్ని శివాజీ నగర్ లో ఓ దుకాణం వద్ద అడ్డగించి అతని గోంతు నులిమి.. జేబులోని డబ్బును, ఇటీవలే కొన్న కొత్త సెల్ ఫోన్ ను అపహరించారు. అయితే ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా అది సాధ్యకాలేదు. ఇక ఈ నేపథ్యంలో ఓ దుండగుడు డబ్బుల కోసం ఎకంగా బాధితుడి ఫ్యాంటును కూడా చించేసి మరీ అందులోంచి డబ్బును దొంగలించాడు.
అయితే హార్డ వేర్ దుకాణం నుంచి లభించిన ఫూటేజీ ఆధారంగా దుండగులను పట్టుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వివరాలను తెలుపుతూ.. ఏసీపీ ప్రీత్ పాల్ సంగ్వాన్ సురేష్ ముఖియా నుంచి నడిరోడ్డుపై డబ్బులు దొంగలించిన ఇద్దరిని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశామని తెలిపారు. వీరిలో ఒకరు రాజు అలియాస్ కాలియా (40), రెండవ నిందితుడు వివేక్ తివారీ (21) అని వీరు సెక్టార్ 5లోని లక్ష్మణ్ విహార్ లో నివసిస్తున్నారని, అయితే వీరు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు.
కాగా, వీరికి నేరాలు కొత్త కాదని, ఇప్పటి వరకు ఏకంగా 24 నేరాలకు పాల్పడ్డారని, పలుమార్లు జైలుకు కూడా వెళ్లివచ్చారని పోలీసులు తెలిపారు. అక్రమంగా ఆయుధాలను కలిగి వున్న కేసులు కూడా వీరిపై నమోదై వున్నాయని తెలిపారు. వీరిద్దరూ పోరిగింట్లో ఉంటున్నారని వీరి జల్సాల కోసం అక్రమాల మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు. సురేష్ ముఖియా ఆ రోజు మధ్యవర్తి ద్వారా తమ కుటుంబానికి డబ్బును పంపడానికి వెళ్తున్నాడని తెలుసుకుని అతడ్ని వెంబడించినట్లు చెప్పారు. వీరిని న్యాయస్థానంలో ముందు ప్రవేశపెట్టి ఒక్క రోజు కస్టడీకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more