From Panasonic employee to Uber rider నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్న కోల్ కతా మహిళ

This kolkata woman became uber bike rider after losing job during pandemic

Panasonic employee, Uber rider: Kolkata woman’s story, Ranabir Bhattacharyyaa, writer, Kolkata, Uber driver, woman Uber driver, coronavirus, after the pandemic, job lost, Lockdown, covid affects, Uber riders, Kolkata, uber scooter riders, job loss, covid job loss, job loss, coronavirus pandemic

The coronavirus pandemic caused massive jobs losses across the world, forcing people to make drastic switches to new and often unfamiliar roles to support their families. In Kolkata, a woman sacked from electronics giant Panasonic had to start riding a scooter for Uber. Her story was shared on LinkedIn by a man who rode with her.

ఉబర్ రైడర్ పై నెటిజన్ల ప్రశంసలు.. రచయిత షేర్ చేసిన కోల్ కతా మహిళ కథ

Posted: 05/17/2022 05:38 PM IST
This kolkata woman became uber bike rider after losing job during pandemic

ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి ఈ యువతి విషయంలో అక్షరాలా నిజమైంది. అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగం ఆకస్మికంగా ఊడితే కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లతారు.. లేక మరికొందరిలా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడలేదు..ఇంకొందరు తమకు సంబంధించిన మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ రోజులు గడిపేయలేదు. కానీ తనకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించాలా.? అన్న వినూత్నంగా ఆలోచన చేసింది.

అమెలో పుష్కలంగా ఉన్న ఆత్మవిశ్వాసం అనుభవం లేని పనిలోనూ రాణించేలా చేస్తోంది. కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల మౌతుషి బసు తాను పనిచేస్తున్న పానసోనిక్ కంపెనీలోని ఉద్యోగం కరోనా లాక్ డౌన్ కారణంగా కొల్పోయింది. కరోనా కారణంగా దేశంలోని లక్షలాది మందిలానే ఆమె కూడా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు. సినీపరిశ్రమకు చెందిన దర్శకుడు, నటులే టీస్టాళ్లు, హోటళ్లు పెట్టుకుని బతుకుబండిని నడిపారు. అలానే బసు కూడా ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం పోయినందుకు అమె ఏ మాత్రం బాధపడలేదు. ఈ పరిస్థితుల్లో తాను కుటుంబాన్ని ఎలా పోషించాలన్న అలోచన చేసింది.

అందుకోసం అమె తనకు ఏమాత్రం పరిచయం లేని రంగాన్ని ఎంచుకుంది. తన కుటుంబానికి అన్నం పెట్టగలిగే.. చట్టబద్దమైన పనిలో చేరితే చాలు అనుకుంది. అంతే ఉబెర్ సంస్థలో డ్రైవర్ గా మారింది. తొలుత కొంత కష్టంగా సాగినా.. ఇప్పుడు మాత్రం చాలా బిజీ అయిపోయింది. రచయిత రణవీర్ భట్టాచార్య లింక్డిన్‌లో ఆమె కథను షేర్ చేయడంతో వైరల్ అయింది. ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. కోల్‌కతాలో తాను బయటకు వెళ్లేందుకు ఉబెర్ బైక్‌ను బుక్ చేస్తే మౌతుషి బసు వచ్చారని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆమెను ప్రశ్నిస్తే.. తను చెప్పిన విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

తాను పానసోనిక్‌లో ఉద్యోగం చేసేదానినని, కరోనా కారణంగా ఉద్యోగం పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఇలా రైడర్‌గా మారినట్టు చెప్పారని రణవీర్ తెలిపారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఆమె బండిని చాలా జాగ్రత్తగా నడిపారని, అందుకు అదనంగా డబ్బులు ఏమీ అడగలేదని పేర్కొన్నారు. ఇలా రైడర్ గా మారాలని ఎందుకు అనిపించిందని అడిగితే, కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదని, అందుకే తెలిసున్న విద్యనే ఎంచుకున్నానని ఆమె చెప్పారని వివరించారు. బసు కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kolkata  Uber driver  woman Uber driver  coronavirus  after the pandemic  job lost  Lockdown  covid affects  

Other Articles