కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నామన్న భయాందోళన మధ్య కరోనా తొలి దశలో దేశప్రజలందరూ అప్రమత్తతో వ్యవహరించారు. అయినా భారీగానే కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా నమోదు కావడంతో దేశప్రజల్లో మరింత అందోళన పెరిగింది. అయితే ఏకంగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించడంతో అన్ లాక్ తో ఒక్కసారిగా ప్రజలకు స్వేచ్ఛ లభించినట్లుగా ఉంది. అయితే అప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చిన వాక్సీన్లు.. కరోనా చికిత్సకు మందులు రావడంతో.. ప్రజల్లో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా అలుముకుంది.
దీంతో కరోనా మహమ్మారి రెండవ దశలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెబుతున్నా పట్టించుకున్న దిశగా ప్రజలు అప్రమత్తం కాలేదు. దీంతో దేశవ్యాప్తంగా రెండో దశ మరణ మృదంగాన్ని లిఖించింది. వందలు, వేలు దాటి లక్ష మార్కు దిశగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎక్కడపడితే అక్కడ కరోనా మృతదేహాలు దర్శనమిచ్చాయి. రోడ్డ పక్కన, నదుల్లో, ఇలా భయపడుతున్న ప్రజలపై మరో పెనుభారం పడినట్టుగా పరిస్థితి మారింది. కాగా, సెకండ్ వేవ్ సమయంలో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని గంగా నదిలో అనేక శవాలు కుప్పలు కుప్పలుగా తేలాయి. మళ్లీ ఇప్పుడు ఈ విషయం తెరపైకి వచ్చింది.
ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్గా తీసుకుంది. కరోనా రెండు దశల్లో ఎన్ని శవాలు గంగానదిలో తేలాయో.. లెక్కలు చెప్పాలని ఇరు రాష్ట్రాలను గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగీ, ఎన్జీటీ సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్ ధర్మాసనం దీనిపై ఇరు రాష్ట్రాలను వివరణ కోరింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది. కోవిడ్ ప్రారంభమైన సమయం నుంచి మొదలు పెడితే, 2020, 2021 సంవత్సరాలు, ఈ యేడాది మార్చి 31 వరకూ ఎన్ని కోవిడ్ శవాలు గంగలో తేలాయో లెక్కలు చెప్పాలని తాఖీదులు పంపింది. అంతేకాకుండా కోవిడ్ శవాలను కాల్చడానికి ఎంత మందికి ఆర్థిక సహాయం చేశారో కూడా చెప్పాలని ఎన్జీటీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Jun 23 | కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయని, వాటికనుగూణంగా తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆకస్మిక సమ్మెకు దిగిన సినీకార్మికులకు టాలీవుడ్ నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన... Read more
Jun 23 | హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి జలక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి.. కౌన్సిలర్ స్తాయికి మాత్రమే పరిమితమైనా.. ప్రజలతో మమేకం అయ్యానని గత ఎనమిదేళ్లుగా పార్టీకి ఎనలేని... Read more
Jun 23 | ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విపక్షాల అరోపణలకు మరో సంఘటన నిలువెత్తు ఉదాహరణగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అధికార పార్టీకి చెందిన కౌన్సీలర్ లావణ్య..... Read more
Jun 23 | ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నా.. ఇప్పటికీ అటో రంగంలో పెట్రోల్, డీజిల్ వాహనాల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అమ్మాకాలు ఓ వైపు స్పష్టం చేస్తూనేవున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల నేపథ్యంలోనూ వాటి వైపే... Read more
Jun 23 | మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, అందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం నుంచి వెనక్కు తగ్గబోమని కేంద్రప్రభుత్వంతో... Read more