పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వారు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు నిన్న ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు. పిటిషనర్లపై ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుంచి నారాయణ 2014లోనే తప్పుకున్నట్టు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు చూపించడంతో అదే రోజు ఆయనకు బెయిలు మంజూరైంది. దీంతో నారాయణ కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నధమయ్యారు.
దీంతో ఈ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ కుటుంబ సభ్యులతో పాటు విద్యాసంస్థలకు చెందిన జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్ ప్రసాద్, వి.శ్రీనాథ్, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్, సురేశ్‌కుమార్, ఎ.మునిశంకర్, బి.కోటేశ్వరరావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమకు మాల్ ప్రాక్టీస్‌తో సంబంధం లేదని, పోలీసులు నమోదు చేసిన కేసులో తమను నిందితులుగా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కోన్నారు,
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వారి తరపు న్యాయవాది అభ్యర్థించారు. పోలీసుల తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. పిటిషనర్లను నిందితులుగా పేర్కొననప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. స్పందించిన న్యాయస్థానం పిటిషనర్లు అసలు నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 18 (బుధవారం) వరకు పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ మన్మథరావు ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 23 | కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయని, వాటికనుగూణంగా తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆకస్మిక సమ్మెకు దిగిన సినీకార్మికులకు టాలీవుడ్ నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన... Read more
Jun 23 | హైదరాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి జలక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి.. కౌన్సిలర్ స్తాయికి మాత్రమే పరిమితమైనా.. ప్రజలతో మమేకం అయ్యానని గత ఎనమిదేళ్లుగా పార్టీకి ఎనలేని... Read more
Jun 23 | ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ నేతల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందన్న విపక్షాల అరోపణలకు మరో సంఘటన నిలువెత్తు ఉదాహరణగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అధికార పార్టీకి చెందిన కౌన్సీలర్ లావణ్య..... Read more
Jun 23 | ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నా.. ఇప్పటికీ అటో రంగంలో పెట్రోల్, డీజిల్ వాహనాల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అమ్మాకాలు ఓ వైపు స్పష్టం చేస్తూనేవున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల నేపథ్యంలోనూ వాటి వైపే... Read more
Jun 23 | మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, అందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం నుంచి వెనక్కు తగ్గబోమని కేంద్రప్రభుత్వంతో... Read more