పద్నాలుగేళ్ల మైనర్ బాలుడిని ముద్దు పెట్టుకోవడంతో పాటు అతని రహస్యబాగాలను తాకడం అసహజ లైంగిక చర్య (అన్‌నాచురల్ సెక్సువల్ అసల్ట్) కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలుడిని ముద్దు పెట్టుకోవడంతోపాటు ప్రైవేటు పార్టులు కూడా తడమాడంటూ ఓ వ్యక్తిపై నమోదైన కేసులో బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం, తడమడం వంటి వాటిని అసహజ లైంగిక నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిలు మంజూరు చేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి బీరువాలో ఉంచిన డబ్బులు తరచూ మాయం అవుతుండడంతో తన 14 ఏళ్ల కుమారుడిని అనుమానించాడు. డబ్బులు ఏమవుతున్నాయని గద్దించగానే బాలుడు నిజం ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు తానే తీస్తున్నానని, వాటితో ఆన్‌లైన్ గేమ్స్ ఓలా పార్ట్ రీచార్జ్ చేయించుకుంటున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో మరో విషయాన్ని కూడా బాలుడు బయటపెట్టాడు. తాను రీచార్జ్ కోసం షాపునకు వెళ్లినప్పుడు దాని యజమాని తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెడుతున్నాడని, ప్రైవేటు పార్టులు తడుముతున్నాడని చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 377 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏడాదిగా జైలులో ఉన్న నిందితుడు ఇటీవల బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభు దేశాయ్.. నిందితుడు బాలుడి పెదాలపై ముద్దులు పెట్టాడని, తాకాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని, అయితే ఈ అభియోగాలు సెక్షన్ 377 కిందికి రావని తేల్చిచెబుతూ నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. నిజానికి సెక్షన్ 377 కింద కేసు నమోదైతే బెయిలు రావడం కష్టమే కాదు.. జీవిత శిక్ష కూడా పడే అవకాశం ఉంది. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్య పరీక్షల్లో ఆధారాల్లేవని జస్టిస్ అనూజ పేర్కొం:టూ బెయిల్ మంజూరు చేశారు.
(And get your daily news straight to your inbox)
Jul 05 | నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల రోజుల క్రితం ఉన్న ఏండ వేడిమిని పోయి.. తొలకరి జల్లులతో దేశప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అప్పుడే... Read more
Jul 05 | తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో ఒక రోజులో గడువు ముగియనుంది. అప్లై చేయనివారు ఉంటే.. అప్లై... Read more
Jul 05 | స్థానబలం అంటే తెలుసుగా.. ఫలానా స్థానంలో ఫలానావారికి బలం అధికంగా ఉంటుందని అర్థం. మరీ ముఖ్యంగా క్రికెట్ లో ఈ పదం చాలా వింటూవుంటాం. ఫలానా మైదనాంలో ఫలానా జట్టుకు బాగా కలసివస్తోంది. వారి... Read more
Jul 05 | భిన్నత్వంలో ఏకత్వం చాటే దేశం మనది. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు.. అనేక ప్రాంతాలు.. ప్రతీ కులానికో ఆచారం. ఒక్కో మతానికి ఒక్కో విధానం. ప్రాంతానికో సంప్రదాయం.. అన్నింటినీ మేళవించినదే భారతీయ సంస్కృతి. అయితే... Read more
Jul 05 | హిజ్రాలను చూస్తేనే కొందరు ఈసడించుకోగా, మరికొందరు భయంతో దూరంగా వెళ్లిపోతారు. ఇక వారు ఎదురుగా వచ్చి డబ్బులు అడిగితే.. లేవని సమాధానం చెప్పి పంపేవారి సంఖ్యే ఎక్కువ. కానీ వారిని కూడా సాధారణ మనుషులు... Read more