Mysterious golden chariot washed ashore in Srikakulam అసని తుపాను ఎఫెక్ట్: శ్రీకాకుళం జిల్లాకు కొట్టుకువచ్చిన స్వర్ణ రథం

Cyclone asani effect mysterious golden chariot washed ashore at sunnapalli sea harbour

Cyclone Asani, golden chariot, Sunnapalli Sea Harbour, Naupada Police Station, higher officials, inscriptions in foreign language, dated 16-01-22, intelligence department, Mysterious golden chariot washed ashore, Golden Chariot Washed Ashore, Cyclone Asani, IMD, India Meteorological Department, srikakulam, Andhra Pradesh

A peculiar looking gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Andhra Pradesh's Srikakulam district on Tuesday amid the consequences of cyclone Asani in the area. The locals present on the sea shore were seen dragging the chariot out of the water and bringing it to the shoreline.

ITEMVIDEOS: అసని తుపాను ఎఫెక్ట్: శ్రీకాకుళం జిల్లాకు కొట్టుకువచ్చిన స్వర్ణ రథం

Posted: 05/11/2022 01:44 PM IST
Cyclone asani effect mysterious golden chariot washed ashore at sunnapalli sea harbour

అస‌ని తుఫాన్‌తో బంగాళాఖాతంలో భీక‌ర అల‌జ‌డి ఉంది. ఏపీ తీరం వెంట స‌ముద్రం ఉప్పొంగుతోంది. అయితే ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరంలో ఓ వింత చోటుచేసుకుంది. ఈ వింతకు శ్రీకాకుళం జిల్లా వేదికగా నిలిచింది. తుపాను కారణంగా బంగారువర్ణంతో గల ఓ రథం శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. ఇతర దేశానికి చెందిన ఓ మందిరంగా దీనిని పేర్కోంటున్నా.. అది స్వర్ణరథంలా ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ స్వర్ణరథాన్ని స్థానికులు సముద్ర తీరం నుంచి ఒడ్డకు లాక్కుని వచ్చారు.

అసని తుపాను కారణంగా ఎంతో అలజడిగా వున్న సముద్ర తీరం.. శ్రీకాకుళంలోని సున్నాపలల్లి రేవు తీరానికి స్వర్ణరథాన్ని తీసుకువచ్చిందన్న వార్త తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో రథాన్ని చూసేందుకు వచ్చారు. సముద్రడే స్వయంగా స్వర్ణరథాన్ని సున్నాపల్లికి తీసుకువచ్చాడని భావిస్తున్న స్థానికులు.. ఆ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వున్న అక్షరాలను కూడా గుర్తించారు. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని పేర్కోన్నారు.

కాగా ఈ స్వర్ణరథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఆ ర‌థం మ‌రో దేశం నుంచి వ‌చ్చి ఉంటుంద‌ని నౌపాడా ఎస్సై తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారుల‌కు ఈ విష‌యాన్ని చెప్పామ‌ని, ఉన్న‌తాధికారులు దీన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఈ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఈ రథం మెరిసిపోతోంది. భారీ స్వర్ణ రథం కొట్టుకొచ్చిందన్న వార్త దవానంలా వ్యాపించడంతో దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles