Cyclone Asani: Light to moderate rain likely in Hyderabad అసని తుపాను ఎఫెక్ట్: తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు​..

Cyclone asani effect telangana likely to experience rains for two days

Cyclone Asani, thunderstorms rains in Telangana, lightning in telangana, gusty winds in Telangana, Heavy rains in Telangana, Heavy rains in Mancherial, Heavy rains in Jayashankar-Bhupalpally, Heavy rains in Mulugu, Heavy rains in Bhadradri-Kothagudem, Heavy rains in Khammam, Heavy rains in Nalgonda, Heavy rains in Suryapet, Heavy rains in Mahabubabad districts

Under the influence of Cyclonic Asani over west central and adjoining southwest Bay of Bengal, which moved west northwestwards with a speed of 10 kmph, different parts of Telangana are likely to witness rains. According to IMD, thunderstorms accompanied with lightning and gusty winds (30-40 kmph) are likely to occur at isolated places. Heavy rains are likely to occur at isolated places in Mancherial, Jayashankar-Bhupalpally, Mulugu, Bhadradri-Kothagudem, Khammam, Nalgonda, Suryapet and Mahabubabad districts over the next two days.

అసని తుపాను ఎఫెక్ట్: తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు​.. హైదరాబాద్లో తెలికపాటి జల్లులు

Posted: 05/11/2022 12:36 PM IST
Cyclone asani effect telangana likely to experience rains for two days

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ మరోమారు దిశ మార్చుకుంది. యూటార్న్ తీసుకుని మిజోరం వైపు వెళ్తుందని తొలుత అంచనా వేయగా, అది కాస్తా దిశ మార్చుకుని ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందని అంచనా వేశారు. ఇక తీరా ఇవాళ మరోమారు దిశమార్చుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది.

తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే గత రెండు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతళం అవుతున్న తీర ప్రాంతం.. ఇక అసని తీరం దాటే నేపథ్యంలో ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందోనని అందోళన మొదలైంది. మరోవైపు అసని తుపాను ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. తుపాన్‌ ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాలైన నల్లగొండ, సూర్యపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగుతో పాటు మహాబూబాబాద్‌, వరంగల్‌, యదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహాబూబ్‌నగర్‌, మంచిర్యాల, జగిత్యాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఇక అసని తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జరిగాల్సిన ఇంటర్ పరీక్షలను ఈనెల 25న నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles