Snake skin found in food, officials shut Kerala restaurant పరోటా పార్శిల్ కవర్లో పాము ఛర్మం.. కస్టమర్ షాక్.!

Snake skin found in food from kerala restaurant officials shut down eatery

Snake skin, food parcel, parota parcel, Shalimar restaurant, Thiruvananthapuram, Nedumangadu area restaurant, Arshitha Basheer, food safety officials, Restaurant shut down, Kerala eatery, Kerala, Crime

A woman and her daughter in Kerala’s Thiruvananthapuram had a rude shock when they allegedly found snake skin in their food delivery parcel. Following the unappetizing discovery, they alerted authorities, who conducted an inspection at the eatery before shutting it down.

చూసుకుని తినండి: పరోటా పార్శిల్ కవర్లో పాము ఛర్మం.. కస్టమర్ షాక్.!

Posted: 05/09/2022 12:44 PM IST
Snake skin found in food from kerala restaurant officials shut down eatery

ప్రజలు అనేక పనులపై బయటకు వెళ్లి సకాలంలో ఇంటికి చేరుకోలేకో.. లేక ఏదో ఒక రోజు బయటి ఆహారం తినాలని ఉందని పిల్లలు అనడంతోనో.. స్థానిక రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకుని తింటుంటారు. అయితే ఇకపై రెస్టారెంట్ల నుంచి ఆహారం తీసుకువచ్చారంటే ముందుగా చెక్ చేసుకున్న తరువాతే తినాలి. చిన్న పొరపాటు జరిగినా.. అది తిన్న వారు ఆనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. ఇలాంటి ఘటనే కేరళలోని ఓ రెస్టారెంట్​ చేసింది. అయితే ఆహారాన్ని తెరచి చూసిన కస్లమర్లు దానిని గుర్తించడంతో పెనుముప్పు తొలగిపోయింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన కేరళ రాష్ట్రంలోని ఓ రెస్టారెంటుకు వెళ్లి ఫుడ్​ ఆర్డర్​ ఇచ్చిన ఓ మహిళకు.. అందులో పాము చర్మం కనిపించింది. తిరువనంతపూరంలోని నెదుమంగడ్​ ప్రాంతంలో ఉన్న హోటల్​లో జరిగింది ఈ ఘటన. ఓ మహిళ తన కూతురితో కలిసి.. ఆ రెస్టారెంట్​లో రెండు పరోటాలను కొనుగోలు చేసింది. తీరా తెరిచి చూస్తే.. పరోటాను కప్పి ఉంచిన పేపర్​లో పాము చర్మం కనిపించింది. ఆ మహిళ ఒక్కసారిగా షాక్​కు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఫుడ్​ సెఫ్టీ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. చివరికి ఆహార భద్రత అధికారుల వద్దకు వెళ్లి.. జరిగిన ఘటనను వివరించింది.

ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు.. ఆలస్యం చేయకుండా ఆ రెస్టారెంట్​లో తనిఖీలు నిర్వహించారు. పరిస్థితి.. చాలా దారుణంగా ఉందని గమనించి, ఆ రెస్టారెంట్​ను తాత్కాలికంగా మూసివేశారు. "రెస్టారెంట్​లో వెంటనే తనిఖీలు చేపట్టాము. చాలా దారుణంగా ఉంది. కిచెన్​లో ఆహార భద్రత ఏమాత్రం కనిపించలేదు. చెత్తను కూడా బయటే పడేస్తున్నారు. వెంటనే రెస్టారెంట్​ను మూసివేశాము. కాగా.. పరోటాను కప్పిన న్యూస్​పేపర్​లోనే పాము చర్మం ఉన్నట్టు మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది," అని నెదుమంగడ్​ ఫుడ్​ సెఫ్టీ ఆఫీసర్​ ఆర్షిత బషీర్​ వెల్లడించారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ రెస్టారెంట్​పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles