Punjab jail supt suspended over ‘lemon scam’ ఐపీఎస్ పదవికే ఎసురు తెచ్చిన నిమ్మకాయలు.. ఖైదీ లేఖతో కదిలిన యంత్రాంగం..

Adding lemon in ration bill proves costly for kapurthala jail official

jail officer, fake lemon purchase, Kapurthala Modern jail, Gurnam Lal, lemon scam, purchase bills, Punjab minister for Jails, Kapurthala Jail Superintendent suspended over lemon fraud, Harjot Singh Bains, jail inmates, fake ration bills, Punjab, Crime

While the common man struggles to buy the lemons as the prices go beyond their reach, a jail officer in Punjab was suspended for raising fake lemon purchase bills. The Punjab government suspended Kapurthala Modern jail superintendent Gurnam Lal after jail records showed that about 50 kilograms of lemons were purchased at Rs 200 per kg, worth Rs 10,000 between April 15- 30, 2022.

ఐపీఎస్ పదవికే ఎసురు తెచ్చిన నిమ్మకాయలు.. ఖైదీ లేఖతో కదిలిన యంత్రాంగం..

Posted: 05/09/2022 11:27 AM IST
Adding lemon in ration bill proves costly for kapurthala jail official

నిమ్మకాయల ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. యావత్ భారతంలోనూ ఈ పరిస్థితి అలుముకుంది. వేసవి వస్తే ఇక నిమ్మకాయలు.. గుమ్మడికాయ ధరలకు చేరడం గ్యారంటిగా మారనున్నాయి. ఇన్నాళ్లు కొన్నింటిపైనే పడిన దళారులు కన్ను ఇక సామాన్యులు తినే ఆహారపధార్థులపై కూడా పడింది. దీంతో మండుటెండల్లో నిమ్మరసం తాగడానికి కూడా సామాన్యులు జంకుతున్నారు. అటు దళారులూ కాదు ఇటు జైలు సూపరింటెండ్ కూడా ఈ పరిస్థితిన సోమ్ము చేసుకోవాలని భావించాడు. అయితే ఈ చిన్న తప్పు ఆయన మొత్తం జీతానికే ఎసురు తెచ్చింది. అంతేకాదు తన కెరీర్ లోనూ మాయని మచ్చను తెచ్చింది.

ఐపీఎస్ అధికారులే జైలు సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఈ స్థాయి అధికారులు చిన్నాచితక మొత్తంలో అవినీతికి పాల్పడరని ప్రభుత్వాలు నమ్ముతాయి. కానీ ప్రభుత్వాలు నమ్మకాలను వమ్ము చేస్తూ.. ఈ ఐపీఎస్ అధికారి అవినీతికి తెరలేపారు‌. ఇక వేసవి నేపథ్యంలో జైలులోని ఖైదీలు మండుటెండను తట్టుకుని ఉండేందుకు నిమ్మకాయలను పంచాడు. అదే అతని పదవికి ఎసరు తెచ్చింది. ఔనా నిమ్మకాయలు ఇస్తే మంచిదేగా అంటారా.? అయితే ఇస్తే బాగానే ఉండేది కానీ ఇవ్వకుండానే ఇచ్చినట్లు చె్ప్పి కుంభకోణానికి తెరలేపడంతోనే అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది.

వేసవి నేపథ్యంలో జైలులో ఖైదీలకు నిమ్మకాయలు అందిస్తున్నట్లు బిల్లులు సృష్టించాడు. డబ్బుకోసం ప్రభుత్వానికి బిల్లులు పంపించాడు. అయితే జైలులో ఉన్న ఖైదీ రాష్ట్ర మంత్రికి లేఖ రాయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంకేముంది జైలు అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. గుర్నమ్‌ లాల్‌.. అనే ఐపీఎస్‌ అధికారి పంజాబ్‌లోని కపుర్తల మోడర్న్‌ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 15-30 తేదీల మధ్య జైలులో 50 కిలోల నిమ్మకాయలు వినియోగించామని, వాటికి కిలోకు రూ.200 చొప్పున మొత్తం రూ.10 వేలకు కొనుగోలు చేశామని ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారు.

అయితే జైలు అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని, తప్పుడు రేషన్‌ బిల్లులు ప్రభుత్వానికి పంపుతున్నాడని, ఆ బిల్లుల్లో పేర్కొన్న కూరగాయలు తమకు ఒక్కసారిగా వడ్డించలేదని రాష్ట్ర జైళ్లశాఖ మంత్రి హర్జోత్‌ సింగ్‌ బైన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి విచారణకు ఆదేశించారు. అవన్నీ తప్పుడు బిల్లులని, అసలు జైలులో ఉన్న స్టాక్‌కు.. బిల్లులకు పొంతన లేదని, నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆహారం అందించడం లేదని, నిమ్మకాయల కుంభకోణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్‌ గుర్నమ్‌ను సస్పెంట్‌ చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles